వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రార్థిస్తే మంచిది, సెల్ఫీలు పెట్టండి: బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్‌లో బుధవారం గోదావరి నిత్య హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదావరి నదిపైన పంటు మీద ఏర్పాటు చేసిన గోదావరి నిత్య హారతి ప్రారంభోత్సవ వేదికపై ఆయన ప్రసంగించారు.

గోదావరి హారతిని ఇక నుండి ప్రతిరోజు నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో మరింత వినూత్నంగా నిర్వహిస్తామని ప్రకటించారు. మరో 13రోజుల్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా కన్నా గొప్పగా నిర్వహిస్తామన్నారు.

గోదావరి నది తెలుగు ప్రజలకు, అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడి అన్నారు. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న 3వేల టిఎంసిల నీటిని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో కరవు ఉండదని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోదావరి తల్లితో ప్రతి వ్యక్తి, ప్రాంతం అనుసంధానం కావాలన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను సంక్రాంతి, దీపావళి, ఉగాది పండుగ కన్నా ముఖ్యమైన పండుగలా రాష్ట్రంలోని ప్రజలంతా జరుపుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు ఒక వ్యక్తికో, ఒక ప్రాంతానికో సంబంధించిన పండుగ కాదని, అన్ని ప్రాంతాల వారూ గోదావరి తల్లిని ప్రార్ధిస్తే రాష్ట్రం లాభపడుతుందన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గోదావరి పుష్కరాలకు రూ.1600 కోట్లు మంజూరుచేసి ఏర్పాట్లు చేయిస్తున్నామని, ఇదీ గోదావరి జిల్లాలంటే తనకున్న అభిమానమని చెప్పారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

శోభాయాత్ర ద్వారా పుష్కర గోదావరి జలాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పంపుతున్నట్టు చెప్పారు. తాను ప్రారంభించిన గోదావరి నిత్య హారతి చరిత్రలో మిగిలిపోతుందన్నారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కుటుంబ సభ్యులతో వచ్చి పుణ్యస్నానాలు చేసి సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో ఉంచాలని, దీనికోసం ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోదావరి నదిని కాలుష్యం నుండి కాపాడుకోవాలని, కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుష్కరాల్లో కూడా భక్తులు చెత్తా చెదారాన్ని వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బుట్టల్లో మాత్రమే చెత్త వేయాలని సూచించారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయటం ద్వారా నదుల అనుసంధానాన్ని సాధిస్తామని, పోలవరం ప్రాజెక్టును కేంద్రంలోని ఎన్‌డిఏ, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ పూర్తిచేసి తీరుతామన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోదావరి నిత్య హారతి కార్యక్రమాన్ని చంద్రబాబు బుధవారం రాత్రి రాజమండ్రిలోని పుష్కర్‌ఘాట్‌లో శంఖాన్ని ఊది ప్రారంభించారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

తెలుగు సంప్రదాయబద్ధమైన పంచె కండువాతో రాత్రి 7.30 గంటలకు పుష్కర్‌ఘాట్‌కు చేరుకున్నారు. ముందుగా గోదావరి మాత విగ్రహానికి, గోదావరి నదికి పూజలు చేశారు. అనంతరం పంటుపై ఏర్పాటు చేసిన వేదికపైకి వెళ్లి గోదావరి నిత్య హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఈ సందర్భంగా గోదావరి పుప్కరాలపై రూపొందించిన గోదావరి పిలుస్తోంది రా పాటల సిడిని, కరపత్రాలను ఆవిష్కరించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం గోదావరి మాతకు పట్టువస్త్రాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుగా అందించారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu to Inaugurate 'Godavari Harathi'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X