హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మనిషి వేరు వేరు అస్థిత్వాలను కలిగి ఉంటాడు. ఒక్కోచోట ఒక్కో విధంగా ఒదిగి జీవిస్తుంటాడు. ఇంట్లో బాధ్యత గల తండ్రిగా... ఆఫీస్‌లో ఉద్యోగిగా... పాఠశాలలో విద్యార్ధిగా ఇలా సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తుంటాడు. కానీ అతడు ఒక్కడే.

అలాగో ఒక్కో సమూహం దగ్గర, ఒక్కో మనిషి దగ్గర, ఒక్కో ముఖంతో కనిపిస్తుంటాడు. ఒకచోట ప్రేమికుడిగా.. ఒకచోట కోపిష్టిగా, నియంతగా, ఇంకోచోట మూర్ఖుడిగా. కానీ అతడు ఒక్కడే. అసులు మొహం వెనుక దాగిన అంతర్ముఖాలివన్నీ.

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

మనిషి తగిలించుకుంటున్న ముసుగుల్ని... ఆ ముసుగులో దాగిన మనుషుల్ని ఆమె రంగుల్లోకి ఒంపింది. మనిషి అంతర్ బహిర్ముఖాల ప్రదర్శనకు కాన్వాస్‌ను వేదికగా మార్చుకుంది. కళకు హద్దులు లేవని చాటుతూ దేశాలు దాటుకొచ్చి మరీ తన చిత్రాల్ని నగరంలో ప్రదర్శించింది.

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

ఆమె భూటాన్ రాజవంశానికి చెందిన జింబిరి. 'ఫేసెస్' అనే పేరుతో ఆమె చిత్రించిన పెయింటింగ్స్‌ని మంగళవారం తాజ్ డక్కన్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి అంతర్ముఖాలను పట్టించే ఈ చిత్రాల్లో గొప్ప సృజనాత్మక దాగి ఉందన్నారు.

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

మనలోని ఆలోచనలకు ఈ చిత్రాలు ప్రతిబింబం అన్నారు. భూటాన్ నుంచి వచ్చి నగరంలో ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

విభిన్న సంస్కృతులు మరింత సుసంపన్నం అయ్యేందుకు కళలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

సినీ నటులు ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వాస్తవ ముఖాల్ని దాచుకొని జీవిస్తున్నారన్నారు.

 తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

మానవ విలువల్ని ఆర్ధిక విలువలు నాశనం చేస్తున్న తరుమంలో మానవత్వాన్ని గురించి తన చిత్రాల ద్వారా మాట్లాడుతోందన్నారు.

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

తాజ్ డెక్కన్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్

కార్యక్రమంలో జేఎన్‌టీయూ మాజీ ప్రిన్సిపాల్ దశరథ్ రెడ్డి, రసాగిని సంస్థ అధినేత భరద్వాజ, సినీ నిర్మాత కొండా కృష్ణం రాజు, పలువురు భూటాన్ విద్యార్ధులు హాజరయ్యారు.

English summary
Art exhibition at Taj Deccan, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X