బ్రెగ్జిట్ ఎఫెక్ట్: రూ.200వందల కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడు
లండన్: ప్రపంచవ్యాప్తంగా బ్రెగ్జిట్ ప్రభావం పడింది. స్టార్ మార్కెట్లు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. బ్రెగ్జిట్ మాత్రం ఓ వ్యక్తికి వందల కోట్ల రూపాయలను సంపాదించి పెట్టింది. 220 మిలియన్ పౌండ్లు.. మన లెక్కల్లో దాదాపు రూ.2వందల కోట్ల మేర జాక్‌పాట్ కొట్టాడు.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోతుందని హెడ్జ్ ఫండ్ సంస్థ అధిపతి క్రిస్పిన్ అడే గట్టిగా నమ్మాడు. బ్రెగ్జిట్ గెలుస్తుందని, ఆపై బంగారానికి డిమాండ్ పెరగడంతో పాటు పౌండ్ విలువ భారీగా పతనమవుతుందని లండన్‌కు చెందిన అతను నమ్మాడు.

పలు సర్వేలు బ్రెగ్జిట్‌కు వ్యతిరేక ఫలితం వస్తుందని చెబుతున్నా వాటిని పక్కన పెట్టి క్రిస్పిన్ బ్రెగ్జిట్ గెలుస్తుందని పందెం కట్టాడు. అంతేకాదు, బంగారం పైన బాగా పెట్టుబడులు పెట్టాడు. రెఫరెండం తర్వాత పౌండ్ విలువ మూడు దశాబ్దాల కనిష్ఠస్థాయికి పడిపోగా, బంగారం ధర పెరిగిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, బ్రెగ్జిట్ ఫలితాలు బ్రిటన్ పందెరాయుళ్లకు నిరాశను మిగిల్చాయి. ఈయూతో కలిసి ఉండేందుకు మొగ్గు చూపుతారని భావించి అధికశాతం అలాగే పందెం కట్టారు. దీంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. క్రిస్పిన్ మాత్రం ఒక్కరోజులో వందల కోట్లు సంపాదించాడు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications