వివాదాస్పద స్వామీ బాబా రాంపాల్‌పై కేసులే కేసులు
న్యూఢిల్లీ: హత్య ఘటనలో బాబా రాంపాల్ పాత్రపై సిబిఐ విచారణ జరిపించాలని వేలాది మంది ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్నారు. రాంపాల్‌ను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు తీవ్ర వ్యతిరేకతే ఎదురైంది. మద్దతుదారులు పోలీసులపైకి దాడికి దిగారు. దాంతో ఆయనను అరెస్టు చేయడం పోలీసులకు ఇప్పటి వరకు కూడా సాధ్యం కాలేదు. రాంపాల్‌ను కబీర్ అవతారంగా అతని శిష్యులు భావిస్తారు. అతనిపై కేసుల మీద కేసులు నమోదయ్యాయి.
హత్య
హర్యానాలోని రోహత్ జిల్లా కరోంతా గ్రామంలో గల అతని సత్‌లోక్ ఆశ్రమాన్ని జిల్లా యంత్రాంగం మూసేసింది. రాంపాల్ శిష్యులకు, ఆర్యసమాజ్ కార్యకర్తలకు మధ్య 2006 జులైలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో ఓ యువకుడు మరణించగా, 59 మంది గాయపడ్డారు. దాంతో పోలీసులు అతనిపై, అతని శిష్యులపై పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. జైలులో 22 నెలల పాటు గడిపిన రాంపాల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆశ్రమాన్ని మూసేయడంతో తన కార్యకలాపాలకు హిసార్ జిల్లాలోని బర్వాలాను కేంద్రంగా చేసుకున్నాడు.

ఫోర్జరీ
రాంపాల్, అతని అనుచరులపై ఫోర్జరీ కేసు కూడా ఉంది. 2006లో ఆర్యసమాజ్ కార్యకర్తలతో ఘర్షణ జరిగిన మర్నాడు అందిన ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదైంది. ఫోర్జరీ ద్వారా సొంతం చేసుకున్న కరోంతా గ్రామంలో సత్ లోక్ ఆశ్రమం కట్టారనేది ఆరోపణ. హర్యానా పోలీసులు రోహత్ సెషన్స్ కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం కృష్ణ అనే మహిళ ఆశ్రమ నిర్మాణానికి ఆ భూమిని విరాళంగా ఇచ్చింది. అయితే, ఆమె కమల అనే మహిళ పేరు మీద ఆమె ఆ భూమిని 1999లో పొందినట్లు ఆరోపణ ఉంది. ఆ భూమి కమల కుటుంబానికి చెందిన నలుగురికి చెందుతుంది. వారిలో కమల సోదరుడు రాజేందర్ సింగ్ కూడా ఉన్నాడు. కమల వాటా ఎకరం కన్నా తక్కువగా ఉంటుంది. ఈ ఆరోపణలను వెబ్‌సైట్‌లో ఆశ్రమం ఖండించింది.
దాడి కేసు
రాంపాల్ శిష్యులు ఏడుగురిపై 2013 మే 5వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఏడుగురిలో ఏ మహిళ కూడా ఉంది. పానిపట్ జిల్లాలోని అతవాలా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి వారిపై ఫిర్యాదు చేశాడు. ఆశ్రమంలో రాంపాల్ శిష్యులు తనను తోసేశారని అతను చెప్పాడు. తాను ఆర్య సమాజ్ గూఢచారిని అని, అర్య సమాజ్ నేతకు వ్యతిరేకంగా వీడియో ప్రకటన చేయాలని తనను బలవంత పెట్టారని ఆయన ఆరోపించాడు.
బెదిరింపులు
అర్య సమాజిస్టులను బెదిరించారనే ఆరోపణపై 2013 మే 9వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆర్య సమాజ్ ఆఫీస్ బియరర్లకు రాంపాల్ శిష్యులు టెలిఫోన్ చేసి బెదిరించారని హర్యానా గోషాల సంఘ్ ఆచార్య సర్వ మితర్ కార్యదర్శి ఫిర్యాదు చేశాడు.
ఆర్య సమాజ్ కార్యకర్త హత్య
కరోంతా గ్రామంలోని ఆశ్రమాన్ని స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన ఆర్య సమాజ్ కార్యకర్తలపై 2013 మే 12వ తేదీన పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో పాటు ముగ్గురు మరణించారు. ఆ మర్నాడు ఆర్య సమాజ్ కార్యకర్త ప్రొమిలా దేవిని హత్య చేశారనే ఆరోపణపై రాంపాల్‌పై హత్య నేరం కింద కేసు నమోదైంది. పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా రాంపాల్ ఆశ్రమం నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్ తగిలి ప్రొమిలా దేవి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. రాంపాల్ ఆదేశాల మేరకే ఆమెపై కాల్పులు జరిపాడని ప్రొమిలా దేవి సోదరుడు సత్నారాయణ ఆరోపించాడు.
ఆర్య సమాజ్ పాత్ర ఉందని విమర్శ
రాంపాల్‌పై, అతని శిష్యులపై ఫిర్యాదులు చేయడం వెనక ఆర్య సమాజిస్టులు ఉన్నారని సత్‌లోక్ ఆశ్రమం అధికార ప్రతినిధి రాజ్ కపూర్ విమర్శిస్తున్నారు. రాంపాల్‌పై, ఆయన శిష్యులపై ఎన్ని ఫిర్యాదులు చేశారో తెలియదు గానీ వాటిలో ఏ మాత్రం వాస్తం లేదని ఆయన అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications