ఆడపిల్ల అని సరోగసి మోసం: తప్పించుకున్న దంపతులు
మాతృత్వం అంటే ఏ వనితకైనా ఆనందమే మరి. అది జీవితంలో వచ్చే అత్యద్భుతమైన అనుభూతి. కొందరు దంపతులకు పిల్లలు పుట్టే బాగ్యం లేక గతంలో పలు ఇక్కట్ల పాలయ్యే వారు.
హైదరాబాద్: మాతృత్వం అంటే ఏ వనితకైనా ఆనందమే మరి. అది జీవితంలో వచ్చే అత్యద్భుతమైన అనుభూతి. కొందరు దంపతులకు పిల్లలు పుట్టే బాగ్యం లేక గతంలో పలు ఇక్కట్ల పాలయ్యే వారు.
టెక్నాలజీ పురోభివృద్ధి సాధించిన తరుణంలో వారంతా అద్దె గర్భం ద్వారా తల్లయ్యే అదృష్టం సంపాదించుకుంటున్నారు. కానీ దాంట్లోనూ ఆడపిల్ల అంటే వెగటు పుట్టడం ఇబ్బందికర పరిణామం. సరోగసీ (అద్దెగర్భం) ప్రక్రియ మరో అమాయక మహిళ పాలిట శాపంగా మారింది.
గుంటూరు జిల్లా జంట... మహబూబ్‌నగర్ జిల్లా మహిళను ఆమె మానాన ఆమెను వదిలేసి ముఖం చాటేసిన ఘటన హైదరాబాద్ నగర పరిధిలో వెలుగు చూసింది.
గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియడంతో 'సరోగసీ' దంపతులు ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. పుట్టేబిడ్డకు, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అర్ధంతరంగా వెళ్లిపోయారు.

సరోగసీ ప్రక్రియను చేసిన వైద్యులూ ఆమెను మోసం చేశారు.
నెలలు నిండి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆమె హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.
మూడు రోజుల కిందట పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నా అన్నవారు లేక, పట్టించుకునే వారు లేక, అనారోగ్యంతో సతమతమవుతోంది.
ఈ సరోగసీ, మోసం విషయం బయటపడకుండా యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పేట్లబురుజు ఆస్పత్రిలో ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి, అటువైపు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేయడం గమనార్హం.
రహస్యంగా డీఎంహెచ్ఓ, పోలీసులకు ఇలా ఫిర్యాదు
పేట్లబురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమణి.. ఈ వ్యవహారంపై జిల్లా వైద్యాధికారికి, చార్మినార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చార్మినార్ పోలీసులు, జిల్లా వైద్యాధికారి పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చి బాధితురాలితో మాట్లాడారు. కానీ ఈ విచారణ గుట్టుగా సాగడం గమనార్హం. కాగా బాధిత మహిళను ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నదని సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా సరోగసీ చేసి, ఇప్పుడు వదిలేసిన ఆస్పత్రి యాజమాన్యం, దంపతుల విషయం బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకోసమే ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారని పేట్లబురుజు ఆస్పత్రి సిబ్బందే పేర్కొన్నారు. మీరైనా ఆ మహిళకు న్యాయం చేయాలని వారు వాపోవడం గమనార్హం. ప్రస్తుతం బాధిత మహిళకు సరోగసీలో మధ్యవర్తిగా వచ్చిన మహిళే సహాయకురాలిగా ఉందని.. ఆమె వెళ్లిపోతానంటే పోలీస్ కేసు పెడతామని బెదిరించడంతో ఉండిపోయిందని వారు తెలిపారు.
Recommended Video

ఇలా మొదలైన ప్రక్రియ
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన ఓ మహిళ (24) భర్తతో విభేదాల వల్ల కొంతకాలంగా భర్త నుంచి దూరంగా ఉంటోంది. ఆమెకు ఏడాది కింద ఓ మధ్యవర్తి ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు పరిచయమయ్యారు. వారికి పిల్లలు లేకపోవడంతో.. సరోగసీ విధానంలో వారికి బిడ్డను కని ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.
ఇందుకు మరో మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో 'సరోగసీ' ప్రక్రియను చేయించుకున్నారు. సుధారాణికి ఎనిమిదో నెల వచ్చే వరకు అంతా బాగానే ఉంది. తొమ్మిదో నెలలో స్కానింగ్ చేసినప్పుడు పుట్టబోయేది ఆడపిల్ల అని ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో బిడ్డను పొందాలనుకున్న దంపతులు 'సరోగసీ'మహిళను అర్ధంతరంగా వదిలేశారు. పుట్టబోయే బిడ్డకు తమకు సంబంధం లేదంటూ వెళ్లిపోయారు. సరోగసీ ప్రక్రియ చేసిన ప్రైవేట్ ఆస్పత్రి ఆ మహిళను రానివ్వలేదు.
అనాథలా పేట్లబురుజు హాస్పిటల్‌లో ప్రసవం
ఆ మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో సరోగసీకి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో మహిళ ఆమెను హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రిలో చేర్చగా, అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప 2.9 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లి మాత్రం తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ.. అనారోగ్యంతో ఉందని తెలిసింది. చట్టవిరుద్ధంగా జరిగిన 'సరోగసీ', మోసం జరిగిన విషయాలు బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా తల్లీబిడ్డలను ప్రత్యేకంగా ఐసీయూలో ఉంచారని.. ఎవరూ అటువైపు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారని చెబుతున్నారు.
బయటపడింది ఇలా
సుధారాణికి సాధారణ ప్రసవం జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నా కూడా.. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆ పాపను నర్సరీ విభాగానికి పంపారు. నర్సులు పాపను నర్సరీకి తీసుకెళ్లగా.. అక్కడి ఇన్‌చార్జి వైద్యురాలు బిడ్డను పరిశీలించి, 'ఆరోగ్యంగానే ఉంది కదా.. ఎందుకు తెచ్చారు?'అని నిలదీశారు. పాప వివరాలన్నీ ఇవ్వాలని కోరగా.. నర్సులు పత్రాలన్నీ తెచ్చి ఇచ్చారు.
వాటిని పరిశీలించిన వైద్యురాలు... ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సరోగసీ ద్వారా బాధిత మహిళ గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న పాపను నర్సరీలో ఉంచాల్సిన అవసరం లేదని, తల్లివద్దే ఉంచాలని స్పష్టం చేశారు. దీంతో పాపను ఐసీయూకు మార్చారు. పాపకు ఏమైనా అయితే తీవ్ర సమస్యలు వస్తాయని.. తల్లీబిడ్డ డిశ్చార్జి అయ్యేవరకు కంటికి రెప్పలా కాపాడాలని సూపరింటెండెంట్ పీజీ వైద్యులకు సూచించినట్లు ఓ పీజీ విద్యార్థిని తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications