హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాఫిక్ రూల్స్‌పై సిటీ పోలీసు బాస్ పాఠాలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు బాధ్యతగా పాటించినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు.

హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో విద్యా సంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులకు ట్రాఫిక్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడారు.

ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ట్రాఫిక్ విభాగం అధికారులు, సిబ్బంది స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు.

ట్రాఫిక్ డిసిపి శ్యాంప్రసాద్ నగర ట్రాఫిక్ విభాగం పనితీరు, ప్రమాదాల సంఖ్యలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రమాదాలు ఎలా జరుగుతాయో అన్న విషయాలను వీడియో క్లిప్పింగ్‌ల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ సంయుక్త కమిషనర్ రఘునాథ్, ఆర్టీసీ ఈడి కోటేశ్వరరావు ప్రసగించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాఠ్యాంశంగా ట్రాఫిక్ రూల్స్

పాఠ్యాంశంగా ట్రాఫిక్ రూల్స్

ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన అంశాలతో విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.

విద్యార్థులే ట్రాఫిక్ మార్షల్స్

విద్యార్థులే ట్రాఫిక్ మార్షల్స్

విద్యా సంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థులనే ట్రాఫిక్ మార్షల్స్‌గా తయారు చేసుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు.

విద్యాసంస్థలు చూసుకోవాలి

విద్యాసంస్థలు చూసుకోవాలి

విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో అవసరమైన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని మహేందర్ రెడ్డి. ముఖ్యంగా విద్యా సంస్థలు ఉపయోగించే వాహనాలు ఆర్టీఏ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఆటోల్లో కుక్కేయొద్దు

ఆటోల్లో కుక్కేయొద్దు

ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకోకుండా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిసారించాలని మహేందర్ రెడ్డి సూచించారు.

మైనర్లు నడపొద్దు

మైనర్లు నడపొద్దు

నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ మాట్లాడుతూ మైనర్ పిల్లలు వాహనాలు నడిపించకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దన్నారు. ట్రాఫిక్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్‌లో ఎక్కువ సంఖ్యలో మైనర్లే పట్టుబడుతున్నారని చెప్పారు.

English summary
Hyderabad city police commissioner M Mahender Reddy suggested to adhere to the traffic rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X