మెడిసిన్ విద్య కరువేనా? సైన్స్ విద్యార్థుల నెత్తిన పిడుగు ‘నీట్’!
చిన్నప్పటి నుంచి మెరిట్ మార్కులు.. పదో తరగతిలో గ్రేడ్‌లో పది పాయింట్లకు వందశాతం మార్కులు.
హైదరాబాద్: చిన్నప్పటి నుంచి మెరిట్ మార్కులు.. పదో తరగతిలో గ్రేడ్‌లో పది పాయింట్లకు వందశాతం మార్కులు. ఆపై ఇంటర్మీడియట్‌లోనూ మంచి మార్కులొచ్చాయి. ఇంకేముంది ఉజ్వల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పుట్టుకొచ్చేస్తాయ్.. కానీ ఇక్కడే ఉంది ట్విస్ట్. తెలంగాణ విద్యార్థినీ విద్యార్థులు 2014కు ముందు వరకు ఒకింత కష్టపడితే మెడిసిన్ (ఎంసెట్)లో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్‌లో చేరిపోయే పరిస్థితి ఉండేది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడి వడి మన పిల్లల విద్యాభ్యాసానికి సీట్లు కాపాడుకున్నా, గత పాలకులు అనుసరించిన పాలసీలతో తెలంగాణలో మెడికల్ కాలేజీలు అట్టేలేవు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే దాదాపు జిల్లాకొకటిగా ఏర్పాటు చేసిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ పట్ల తమ వివక్ష ఎటువంటిదో చూపారు.

500 లోపు ర్యాంకు వస్తేనే మెడిసిన్ సీట్
సొంత రాష్ట్రం తెలంగాణ ఏర్పాటైన సంతోషం సాధారణ ప్రజలందరికీ మిగిలింది. కానీ ఏపీ నుంచి విడిపోయిన తర్వాత 2014 నుంచి ఉన్నత వర్గాల వారి పిల్లలు, వెనుబడిన తరగతుల వారి మధ్యతరగతి విద్యార్థులు 500 లోపు ర్యాంక్ వస్తేనే సీటు గ్యారంటీ. 2016లో ఎంసెట్ పరీక్ష రాయడానికి ముందు విద్యార్థుల నెత్తిన పిడుగు పడింది. జాతీయ స్థాయిలో ‘నీట్' ముందుకు వచ్చింది. సీబీఎస్ఈ సిలబస్ ఆధారిత పరీక్ష ఇది. రాష్ట్ర సిలబస్ అయినా సీబీఎస్ఈ పద్దతిలో బోధన జరిగినా అందుకోవడం కష్ట సాధ్యంగా మారుతుంది. 2016లో అదీ ఎంసెట్ రాయడానికి ముందు నీట్ రాయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆచరణలో తర్వాత వెనక్కు తగ్గింది అది వేరే విషయం.

సుప్రీం తాజా తీర్పుతో జాతీయ కోటాలో 12 వేలు లభ్యత పాజిటివ్
అప్పటి నుంచి సైన్స్ విద్యార్థులు.. ఎంబీబీఎస్ చదవాలని కోరుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులకు మొదలైంది అసలు టెన్షన్. ఎలా చదువాలన్న ఆందోళన ప్రారంభమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో చదివే విద్యార్థులకు ‘నీట్' కాన్సెప్ట్ అర్థమైనా లక్ష్యానికి చేరుకోవాలంటే దీక్షగా చదువాల్సిన పరిస్థితి. అయినా ర్యాంక్ వస్తుందా? అని గ్యారంటీగా చెప్పలేం. కాకపోతే రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో వచ్చే ఏడాది నుంచి జాతీయస్థాయిలో 15 శాతం సీట్లు నాన్ లోకల్ కోటాలో (12 వేల సీట్లు) కూడా అందుబాటులోకి రావడం ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రప్రదేశ్.. స్థూలంగా తెలుగు విద్యార్థులకు కొన్ని అదనపు అవకాశాలు రానున్నాయి. అయితే ఇది వేరే సంగతి.

ఇలా సైన్స్ విద్యార్థుల్లో ఆవేదన మొదలు
ఈ ఏడాది మెడిసిన్, అగ్రికల్చరల్ కోర్సుల కౌన్సెలింగ్ విషయానికి వద్దాం.. గత మే 12వ తేదీన తెలంగాణ ఎంసెట్.. అంతకుముందు ఏడో తేదీన ‘నీట్' ఎంట్రన్స్ రాశారు. ఇందులో పూర్తి విషయాలు తెలియని వారికి.. ఎంసెట్‌లో మెరుగైన ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ‘నీట్' లో ర్యాంకు వచ్చి ఉంటుంది. ఎంబీబీఎస్‌లో చేరి ఉంటుందనుకుంటాం కదా. ఎంబీబీఎస్ కాదు గదా.. చివరికి దంతవైద్య (బీడీఎస్) కోర్సులోనూ సీటు రాలేదు. ఇలా ఒకరో ఇద్దరో కాదు. వందల ఎంసెట్ ర్యాంకర్లు నీట్‌లో విఫలమైనట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీ అధ్యయనంలో వెల్లడైంది. తమిళనాడులో నీట్ ర్యాంకు రాక, ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న అనిత మాదిరిగా బాధపడుతున్న వారు తెలంగాణలో పలువురు ఉన్నారు.

4 నుంచి ఏజీబీఎస్సీ రిజర్వుడ్ కౌన్సెలింగ్
గ్రామీణ ప్రాంతాల్లో, అరకొర వసతులతో, రాష్ట్ర సిలబస్‌తో ఇంటర్ కష్టపడి పూర్తిచేసి మంచి మార్కులు, ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సంపాదించిన వారు నీట్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. గత ఐదు రోజులుగా పశువైద్య, వ్యవసాయ, ఉద్యాన కోర్సుల సీట్ల భర్తీకి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ఓపెన్ కేటగిరీ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇక రిజర్వుడ్ కేటగిరీల విద్యార్థులకు తిరిగి సోమవారం నుంచి కౌన్సెలింగ్మొదలుకానున్నది. ఇప్పటి వరకూ జరిగిన కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థుల మార్కులు, ర్యాంకుల వివరాలు, వారి మనోగతాన్ని యూనివర్శిటీ వర్గాలు సేకరించాయి. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సుల్లో వీరెందుకు చేరుతున్నారనేది తెలుసుకోగా ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి.

ఇప్పుడు ఎంసెట్ టాపర్లలో 200 మంది అగ్రికల్చరల్ స్ట్రీమ్
గతంలో నీట్ రాకముందు.. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా తొలుత ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలయ్యాక ఈ కోర్సులకు కౌన్సెలింగ్ ఉండేది. అప్పుడు ఎంసెట్‌లో కనీసం 2,500 ఆపైన ర్యాంకు వచ్చిన విద్యార్థికి పశువైద్య, వ్యవసాయ కోర్సుల్లో మొదటి సీటు కోసం కౌన్సెలింగ్‌కు వచ్చేవారు. ఎంసెట్‌లో వెయ్యి ర్యాంకుల్లోపు వచ్చినవారు అప్పట్లో ఒక్కరంటే ఒక్కరైనా ఈ కౌన్సెలింగ్‌కు వచ్చేవారే కాదు. కానీ ఇప్పుడు ఏకంగా 200 మందికి పైగా వచ్చి సీట్లు తీసుకున్నారు. ఎంసెట్‌లో వెయ్యిలోపు ర్యాంకు రావడం అంటే ప్రతిభావంతులైన విద్యార్థుల కిందనే పరిగణిస్తారు.

రాష్ట్ర సిలబస్‌కు పరిమితమైతే ఇక అంతే
మరి ఇలాంటి వారు ఏకంగా 200 మంది ఇటువైపు రావడానికి ప్రధాన కారణం వీరికి అసలు నీట్‌లో సరైన ర్యాంకు రాకపోవడమే. జయశంకర్ యూనివర్శిటీలో మొదటి సీటు తీసుకున్న విద్యార్థికి ఎంసెట్‌లో 300 ర్యాంకు వస్తే నీట్‌లో 30 వేలకు పైగా ర్యాంకు వచ్చినట్లు గుర్తించారు. సదరు విద్యార్థి మెడిసిన్‌లో సీటు రాక ఇక్కడ వచ్చి చేరుతున్నట్లు కొంత అసౌకర్యంగా చెప్పారు. నీట్ చాలా కష్టంగా ఉందని, మన రాష్ట్రంలో ఇంటర్ సిలబస్‌కే పరిమితమైతే నీట్ నెగ్గడం కష్టమని ఇలాంటి విద్యార్థులంతా స్పష్టం చేశారు.

దీక్ష ప్లస్ పట్టుదల కలిసి సాగితేనే సత్ఫలితం
హైదరాబాద్ నగర వాతావరణంలో చదివిన వారి పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్, అనంతపురం నగరాల్లో చదువుకున్న అమ్మాయికి బైపీపీ గ్రూపు సబ్జెక్టుల్లో 600కు 595 మార్కులొచ్చాయి. 99.16 శాతం మార్కులతో రాష్ట్ర టాప్ ర్యాంకర్ స్థాయిలో నిలిచింది. తెలంగాణ ఎంసెట్‌లో 2,375, నీట్‌లో 65,300 ర్యాంకు వచ్చింది. చివరికి ఉద్యాన కోర్సులో సీటు మాత్రమే కౌన్సెలింగ్‌లో వచ్చే అవకాశం ఉంది. ఆఖరుకు పశువైద్య, వ్యవసాయ డిగ్రీ సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎంసెట్‌లో 2,375కు ముందు ఉన్నవారంతా ఎంబీబీఎస్, బీడీఎస్‌కు వెళ్లేవారు. కానీ ఈ ఏడాది నీట్ కారణంగా పశువైద్య సీట్లు ఎంసెట్‌లో 1,141, వ్యవసాయ డిగ్రీ సీట్లు 1,852 ర్యాంకుతోనే చివరి సీటు భర్తీ అయింది. ఇంటర్‌లో 99.16 శాతం మార్కులొచ్చిన టాపరే నీట్ నెగ్గలేదంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో అత్తెసరు సౌకర్యాల నడుమ చదివే పిల్లలకు అది అందడం మరింత కష్టమని ఓ ప్రొఫెసర్ అన్నారు.

ప్రణాళికాబద్ధంగా ముందుకెళితేనే సక్సెస్
‘నీట్'లో టాప్ ర్యాంకర్లు సైతం విఫలమైనట్లు తమ పరిశీలనలో తేలిన మాట వాస్తవమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుధీర్ అంగీకరించారు. తెలుగు విద్యార్థులను నీట్‌కు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయకపోతే జాతీయస్థాయిలో వైద్య కోర్సుల్లో చేరే అవకాశాలు ఎప్పటికీ అందవని స్పష్టం చేశారు.. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినా నీట్‌లో నెగ్గలేకపోవడం పిల్లల్లో న్యూనతాభావాన్ని పెంచుతోందన్న మాట కూడా నిజమేనని పేర్కొన్నారు. కనుక మెరిట్ విద్యార్థులకు అవగాహన కల్పించి మంచి బోధన ఏర్పాటుచేస్తే నీట్‌లోనూ నెగ్గుతారని వివరించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications