చీకట్లో రాజ్‌భవన్, గర్ల్స్ క్యాండిల్ మెరుపు (పిక్చర్స్)

హైదరాబాద్: ఎర్త్ అవర్ డేను పురస్కరించుకొని శనివారం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుఎఫ్, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్‌ను నిర్వహించారు. పీపుల్స్ ప్లాజాలోను ఎర్త్ అవర్ డే నిర్వహించారు.

గచ్చిబౌలిలోని బైక్ స్టేషన్ వద్ద సినీ నటుడు, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రచారకర్త రామ్ చరణ్ తేజ జెండా ఊపి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు సైక్లింగ్ ఎంతో దోహతం చేస్తుందన్నారు. మెట్రో రైలు ఎండి ఎన్‌విఎస్ రెడ్డి, శోభన కామినేని, హెచ్‌బిసి చైర్మన్ డివి మనోహర్, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

మనిషి స్వార్థం కోసం చేస్తున్న విధ్వంసం, పారిశ్రామికీకరణ పేరుతో విచ్ఛలవిడిగా అడవులు నరకటం.. విద్యుత్ ఉత్పాదన పేరిట కాలుష్యం వెదజల్లటం.. ఇలా కారణాలు ఏవైతేనేం భూగోళం వేడెక్కిపోతుంది.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

ఇదే రీతిలో మానవుడు తన ధ్వంసరచన చేస్తూ పోతే మరికొద్ది సంవత్సరాల్లోనే భూమి మీద జీవి మనుగడ అనేదే లేకుండా పోతుందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

వీరి ఆందోళన ప్రభావం వల్లనే కొద్ది సంవత్సరాలుగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కు యువత తమ సంపూర్ణ సహకారం అందిస్తోంది.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

అదే రీతిలో ఈసారి కూడా హైదరాబాదీ యువత స్పందించింది. ఈ స్పందనే భారతదేశం నుంచి ఎర్త్ అవర్ సిటీ ఛాలెంజ్‌లో నిలిచిన ఒకే ఒక్క మెట్రోనగరంగా హైదరాబాద్‌ను నిలిపింది.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

శనివారం రాత్రి హైదరాబాదులోని పీపుల్స్‌ప్లాజా వద్ద జరిగిన ఎర్త్ అవర్ వేడుకలో ఆయా కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

ఒక గంట పాటు లైట్లు ఆర్పివేయటం వల్ల పెద్ద ఎత్తున పర్యావరణ కాలుష్యం తగ్గించిన వారమవుతామంటూ , ఎర్త్ అవర్ రోజున ఒక గంట లైట్లు ఆర్పటం వరకూ మాత్రమే పరిమితం కాకుండా మిగిలిన రోజుల్లో కూడా వీలైనంత తక్కువగా విద్యుత్‌ను వాడవలసిందిగా అభ్యర్ధించారు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

యువతకు ఉత్సాహం కలిగించటానికే అంటూ ఆల్టర్ ఎగోజ్ బ్యాండ్ రాక్ బాండ్‌తో పాటుగా తెలుగు రాక్ బాండ్ రూట్జ్, డిజె పృథ్వీలు తమ సంగీత ఝురులను వినిపించారు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

సేవ్ ఎర్త్ అంటూ వాతావరణ కాలుష్యం అవుతున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా శాండ్ ఆర్టిస్ట్ హరికృష్ణ చూపితే, పర్యావరణ రక్షణకు యువత నడుంబిగించాల్సిన సందేశాన్ని తమ మైమ్ యాక్ట్ ద్వారా నాసర్ స్కూల్ విద్యార్థులు వివరించారు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

టర్న్ ద లైట్స్ ఔట్ అంటూ విద్యార్థిని ఐశ్వర్యథీమ్ సాంగ్‌ను ఆలపించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యుడబ్ల్యుఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా, ఛైర్మన్ - అనిల్, ఎస్ఇసిఎం సిఈవో చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సిఈవో జివి ప్రసాద్, బ్రిటీష్‌డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెకలిస్టర్ తో పాటుగా పలువురు సినీ తారలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్ డేను పురస్కరించుకొని శనివారం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుఎఫ్, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్‌ను నిర్వహించారు. పీపుల్స్ ప్లాజాలోను ఎర్త్ అవర్ డే నిర్వహించారు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

గచ్చిబౌలిలోని బైక్ స్టేషన్ వద్ద సినీ నటుడు, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రచారకర్త రామ్ చరణ్ తేజ జెండా ఊపి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఎర్త్ అవర్

ఎర్త్ అవర్

వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు సైక్లింగ్ ఎంతో దోహతం చేస్తుందన్నారు. మెట్రో రైలు ఎండి ఎన్‌విఎస్ రెడ్డి, శోభన కామినేని, హెచ్‌బిసి చైర్మన్ డివి మనోహర్, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+