బియాస్ ట్రాజెడీ: ఆరని శోకం (పిక్చర్స్)

హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రమాద సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది.
ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం సాయంత్రం కొట్టుకుపోయిన బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్లో నలుగురి మృతదేహాలను సోమవారం గుర్తించారు.

విద్యార్థులు ఫొటోలు దిగిన ప్రదేశానికి 20 కిలోమీటర్ల దూరంలో పండో డ్యామ్ సమీపంలో మొత్తం ఐదు మృతదేహాలు వెలికితీశారు. వీటిలో చర్లపల్లికి చెందిన ఆకుల విజేత, నల్లగొండ జిల్లా మోతే గ్రామానికి చెందిన బానోతు రాంబాబు, గోల్నాక అల్వాల్‌కు చెందిన గంపల ఐశ్వర్య, కూకట్‌పల్లి ఈనాడు కాలనీకి చెందిన లక్ష్మీగాయత్రి మృతదేహాలను గుర్తించారు. వీరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

విద్యార్థుల మృతదేహాలకు మండి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రక్షణ శాఖ విమానంలో చండీగఢ్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. ఈ ప్రమాదంలో గల్లంతైన మిగతా విద్యార్థుల కోసం, టూర్ ఆపరేటర్ ప్రహ్లాద్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. సహాయక చర్యల్లో గజ ఈతగాళ్లతోపాటు, రెండు బెటాలియన్ల ఎస్ఎస్‌బీ (సశస్త్ర సీమా బల్- సాయుధ సరిహద్దు బలగాల) సిబ్బంది సహా మొత్తం 70 మంది పాల్గొన్నారు. వీరికి స్థానిక పోలీసులు, హోమ్‌గార్డులు, ర్యాఫ్టర్స్ సహకారం అందిస్తున్నారు.

నీటిలో కొట్టుకుపోయిన విద్యార్థుల తల్లిదండ్రులంతా అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాలేజీకి చెందిన ప్రొఫెసర్లు ఆదిత్య, కిరణ్‌లను అధికారులు కులూలోనే ఉంచారు. విద్యార్థుల మృతదేహాలు సోమవారం రాత్రి హైదరాబాదు చేరుకున్నాయి.

బేగంపేట విమానాశ్రయంలో..

బేగంపేట విమానాశ్రయంలో..

గాలింపులో దొరికిన విద్యార్థుల మృతదేహాలను సోమవారం రాత్రి హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి తరలించారు.

విషాద వాతావరణం..

విషాద వాతావరణం..

మృతదేహాలు చేరడానికి ముందు బేగంపేట విమానాశ్రయం వద్ద విషాద వాతావరణం నెలకొని ఉంది. పోలీసులు ఇలా వేచి చూస్తూ కనిపించారు.

పల్లె రఘునాథ రెడ్డి ఇలా..

పల్లె రఘునాథ రెడ్డి ఇలా..

బేగంపేట విమానాశ్రయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మీడియాతో తాము చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు.

తెలంగాణ మంత్రులు...

తెలంగాణ మంత్రులు...

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ, మంత్రి పద్మారావు బేగంపేట విమానాశ్రయం వద్ద ఇలా కనిపించారు.

ఎదురు చూపులు..

ఎదురు చూపులు..

బేగంపేట విమానాశ్రయానికి మృతదేహాలు చేరుకోవడానికి ముందు ఇలా ఎదురు చూపులు.. విషాద వాతావరణమే కనిపించింది.

అంబులెన్స్‌లు సిద్ధం..

అంబులెన్స్‌లు సిద్ధం..

బేగంపేట విమానాశ్రయానికి మృతదేహాలు చేరిన వెంటనే అక్కడి నుంచి తరలించడానికి ఇలా అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.

బేగంపేటకు విమానం..

బేగంపేటకు విమానం..

మృతదేహాలతో బేగంపేట విమానాశ్రయానికి రక్షణ శాఖకు చెందిన ప్రత్యేక విమానం ఇలా చేరుకుంది.

లక్ష్మీగాయత్రి మృతదేహం..

లక్ష్మీగాయత్రి మృతదేహం..

లక్ష్మీగాయత్రి మృతదేహాన్ని ఇలా అంబులెన్స్‌లోకి తరలిస్తూ కనిపించారు. తీవ్ర విషాద వాతావరణం చోటు చేసుకుంది.

తెలంగాణ విద్యాశాఖ మంత్రి

తెలంగాణ విద్యాశాఖ మంత్రి

బేగంపేట విమానాశ్రయం వద్ద తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు ఇలా కనిపించారు.

మంత్రుల చేయూత..

మంత్రుల చేయూత..

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ, మంత్రి పద్మారావు తదితరులు మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి తరలించడంలో చేయి వేశారు.

ఈ శోకం తీరేదా..

ఈ శోకం తీరేదా..

ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లో ప్రాణాలు పోగొట్టుకుని విగతజీవిగా వచ్చిన విద్యార్థినిని చూసి శోకసముద్రంలో ఇలా..

ఆకుల విజేత శవం..

ఆకుల విజేత శవం..

బియాస్ నదిలో ప్రాణాలు కోల్పోయిన ఆకుల విజేత మృతదేహం ఇలా చేరుకుంది. కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం..

ఆరని శోకం...

ఆరని శోకం...

ప్రాణాలు కోల్పోయిన తమ విద్యార్థిని మృతదేహాన్ని చూసి తట్టుకోలేక రోదిస్తున్న బంధువులు, కుటుంబ సభ్యులు ఇలా.

పెను విషాదం ఇలా..

పెను విషాదం ఇలా..

బియాస్ నదిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబ సభ్యుల పెను విషాదం ఆరేది కాదు.

కలిసి పంచుకున్నారు...

కలిసి పంచుకున్నారు...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఒక్కటై బాధితులకు అండగా నిలిచారు. వారు ఇలా బాధితులకు సహాయం చేస్తూ కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+