వైభవంగా శ్రీవారి ‘త్రిశూల స్నానం’(పిక్చర్స్)
తిరుపతి: శ్రీకపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు త్రిశూలస్నానంతో గురువారం వైభవంగా ముగిశాయి. చివరిరోజు త్రిశూలస్నానం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తాదుల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అంతుకుముందు ఉదయం 7 నుంచి 9గంటల వరకు శ్రీనటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వూరేగింపు అన్నారావుకూడలి, ఇస్కాన్ మందిరం, తితిదే క్వార్టర్స్, తిరుమల బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయం వరకు కొనసాగింది. వూరేగింపులో అడుగడుగునా భక్తులు స్వామివారికి స్వాగతం పలుకుతూ మొక్కులు తీర్చుకున్నారు.
ఊరేగింపులో వాహన సేవల ముందు కళాకారుల చెక్క భజనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాయంత్రం 6 నుంచి 7.30 వరకు నిర్వహించిన ధ్వజారోహణంతో శ్రీకపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.

నటరాజ ఉత్సవం
శ్రీకపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు త్రిశూలస్నానంతో గురువారం వైభవంగా ముగిశాయి.

నటరాజ ఉత్సవం
చివరిరోజు త్రిశూలస్నానం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తాదుల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

త్రిశూల స్నానం
అంతుకుముందు ఉదయం 7 నుంచి 9గంటల వరకు శ్రీనటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

త్రిశూల స్నానం
వూరేగింపు అన్నారావుకూడలి, ఇస్కాన్ మందిరం, తితిదే క్వార్టర్స్, తిరుమల బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయం వరకు కొనసాగింది.

త్రిశూల స్నానం
ఊరేగింపులో అడుగడుగునా భక్తులు స్వామివారికి స్వాగతం పలుకుతూ మొక్కులు తీర్చుకున్నారు.

త్రిశూల స్నానం
ఊరేగింపులో వాహన సేవల ముందు కళాకారుల చెక్క భజనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

త్రిశూల స్నానం
ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాయంత్రం 6 నుంచి 7.30 వరకు నిర్వహించిన ధ్వజారోహణంతో శ్రీకపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.

త్రిశూల స్నానం
ముగింపు బ్రహ్మోత్సవాల్లో ఆలయ డిప్యూటీ ఈవో బాలాజీ, ఏఈవో శంకర్‌రాజు, ఏవీఎస్‌వో కూర్మారావు, సూపరింటెండెంట్ ఓబుల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నారాయణ, శ్రీనివాసులు, ప్రధాన అర్చకులు మణి, సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications