అసలేం చేయాలి?: స్పీకర్‌ను చిక్కుల్లో పెట్టిన ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు కారు ఎక్కడం, స్వయంగా గతంలో ఫిర్యాదు చేసిన ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పుడు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో.. చర్యల పైన స్పీకర్ మధుసూదనా చారి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ఐదుగురు ఎమ్మెల్యేల పైన గతంలో ఎర్రబెల్లి దయాకర రావు టిడిపి శాసన సభా పక్ష నేతగా సభాపతికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అదే ఎర్రబెల్లి పార్టీ మారారు. అలా మారినవారందరూ కలిసి తమను టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని లేఖ ఇస్తే ఏం చేయాలి?
వీరికి ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందా? లేక 2/3 వంతు మందిని పార్టీ మారినట్లుగా గుర్తించి బులిటెన్ విడుదల చేస్తారా? తొలుత టిఆర్ఎస్‌లో చేరిన తలసాని చేసిన రాజీనామాను ఆమోదిస్తారా? టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో ఏం చేస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖలోనూ వీటిపైనే చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా, సంక్లిష్టంగా పార్టీ ఫిరాయింపులు జరగడంతో ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలన్నదానిపై తెలంగాణ స్పీకర్, శాసనసభ కార్యదర్శి నిపుణులతో చర్చిస్తున్నారు.
జాతీయ స్థాయిలోనూ నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ అడ్వొకేట్ జనరల్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. గతంలో తలసాని, తీగల, తదితరులపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలంటూ ఎర్రబెల్లి ఇచ్చిన లేఖపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
గతంలో ఫిరాయింపులపై లేఖ ఇచ్చిన వ్యక్తే ఇప్పుడు విలీన లేఖ ఇచ్చారని, వీటిలో దేనికి ప్రామాణికత ఉంటుందన్నదానిపై స్పీకర్, శాసనసభ ఉన్నతాధికారులు.. నిపుణుల అభిప్రాయాలు, న్యాయ నిపుణులసలహాలు తీసుకుంటున్నారు. ఫిరాయింపులపై అన్ని పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మీద ఒకేసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్ సమావేశాల నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications