స్వదేశీ: వరద సాయం కోసం 2నేవీ షిప్పులు(పిక్చర్స్)

విశాఖపట్నం: యుద్ధనౌకల తయారీలో రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ అన్నారు. యుద్ధనౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే శక్తి మనకుందని సతీష్ చెప్పారు. డిసెంబర్ 4 నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్‌ఎస్ సహ్యాద్రిపై గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

1963లోనే కోల్‌కతా షిప్‌యార్డులో ఐఎన్‌ఎస్ అజయ్ యుద్ధ నౌకను తయారు చేశామన్నారు. 1972లో స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్‌ఎస్ నీలగిరి యుద్ధ నౌకను తయారు చేయగలిగామన్నారు. ఈమధ్య కాలంలో ఐఎన్‌ఎస్ సహ్యాద్రిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశామని అన్నారు. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్‌ఎస్ కర్మత్ త్వరలోనే నౌకాదళంలో చేరబోతోందని సోనీ వివరించారు.

దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 40కి పైగా యుద్ధనౌకలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారవుతున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దగా వినియోగించుకోనవసరం లేదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వైస్ అడ్మిరల్ విమల్‌వర్మ, రియర్ అడ్మిరల్స్ ఎస్‌వి బోకర్, ఎస్‌ఆర్ శర్మ, ప్రదీప్ రాణా, సంజయ్‌మదోరా పాల్గొన్నారు.

కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తమిళనాడు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి నౌకదళానికి చెందిన రెండు షిప్పులు ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు బయల్దేరాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఈ షిప్పుల ద్వారా అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సతీష్ సోనీ

సతీష్ సోనీ

యుద్ధనౌకల తయారీలో రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ అన్నారు.

సతీష్ సోనీ

సతీష్ సోనీ

యుద్ధనౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే శక్తి మనకుందని సతీష్ చెప్పారు.

సతీష్ సోనీ

సతీష్ సోనీ

డిసెంబర్ 4 నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్‌ఎస్ సహ్యాద్రిపై గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

వరద సాయం కోసం షిప్పులు

వరద సాయం కోసం షిప్పులు

1963లోనే కోల్‌కతా షిప్‌యార్డులో ఐఎన్‌ఎస్ అజయ్ యుద్ధ నౌకను తయారు చేశామన్నారు. 1972లో స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్‌ఎస్ నీలగిరి యుద్ధ నౌకను తయారు చేయగలిగామన్నారు.

వరద సాయం కోసం షిప్పులు

వరద సాయం కోసం షిప్పులు

ఈమధ్య కాలంలో ఐఎన్‌ఎస్ సహ్యాద్రిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశామని అన్నారు. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్‌ఎస్ కర్మత్ త్వరలోనే నౌకాదళంలో చేరబోతోందని సోనీ వివరించారు.

వరద సాయం కోసం షిప్పులు

వరద సాయం కోసం షిప్పులు

దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 40కి పైగా యుద్ధనౌకలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారవుతున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దగా వినియోగించుకోనవసరం లేదని ఆయన చెప్పారు.

వరద సాయం కోసం షిప్పులు

వరద సాయం కోసం షిప్పులు

ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకూ విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

వరద సాయం కోసం షిప్పులు

వరద సాయం కోసం షిప్పులు

89 దేశాలకు ఆహ్వానపత్రాలు పంపించామని, ఇప్పటి వరకూ 25 దేశాల నుంచి నేవీ ప్రధానాధికారులు వస్తున్నట్టు వర్తమానం పంపించారని సోనీ తెలియచేశారు.

వరద సాయం కోసం షిప్పులు

వరద సాయం కోసం షిప్పులు

అలాగే 32 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు ఇప్పటి వరకూ తమకు సమాచారం అందిందని అన్నారు. ఫ్లీట్ రివ్యూని దృష్టిలో పెట్టుకుని నగర సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

వరద సాయం కోసం షిప్పులు

వరద సాయం కోసం షిప్పులు

ఈ సందర్భంగా లక్ష మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఆ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని చెప్పారు. లక్షవ మొక్కను ప్రధాని మోడీ విశాఖలో నాటనున్నారని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+