పేరుకే చిరు: సర్వం అల్లు

అల్లు అరవింద్ పై చర్చ సందర్భంగా జరిగిన వ్యవహారం వల్లనే అలక వహించి చేగొండి హరిరామ జోగయ్య, టి.దేవేందర్ గౌడ్ సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చినట్లు సమాచారం. దశాబ్దాలుగా చిరంజీవిపై ఈగ వాలకుండా కాపాడుతోంది తానేనని అల్లు అరవింద్ ప్రకటించుకున్నారు. తెర ముందు నటించేది చిరంజీవే అయినా తెర వెనక ఉండి ఆడించేది మాత్రం అల్లు అరవిందే. అందువల్ల ప్రస్తుత పరిణామాలకు చిరంజీవి గానీ అల్లు అరవింద్ గానీ ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితి లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది.
చిరంజీవి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అల్లు అరవింద్ ను పూర్తిగా వెనకేసుకొచ్చారు. అల్లు అరవింద్ పై కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అల్లు అరవింద్ తప్ప మరొకరు తనను కట్టడి చేయలేరనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అందువల్ల సీనియర్లు పార్టీలోని లోటుపాట్లను సరిదిద్దుకుని పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలేవీ ఫలించకపోవచ్చు. ఈ స్థితిలో పార్టీ వ్యవహారాలు నచ్చని వారు, చిరంజీవి పనితీరు ఇష్టపడని వారు ఒక్కరొక్కరే పార్టీ నుంచి వెలుపలికి వచ్చే వాతావరణమే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద, ఎన్నికల్లో వైఫల్యం నుంచి చిరంజీవి ఏ విధమైన గుణపాఠం నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications