రాములమ్మకు మరో చాన్స్

Vijayashanthi
తెలంగాణ రాములమ్మ, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వల్ల సంభవించిన తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె మనసు మార్చుకునే అవకాశం ఉందని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు భావిస్తున్నారని సమాచారం. దీంతో విజయశాంతిపై తెరాస నాయకత్వం తన దాడిని ఆపింది. ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో విజయశాంతిపై చర్య తీసుకుంటారని భావించారు. అయితే తెరాస కార్యవర్గ సమావేశం విజయశాంతి ఊసే లేకుండా ముగిసింది. ఆమె పునరాలోచనలో పడే అవకాశం ఉందని, తిరిగి తమ పార్టీలోకి రావచ్చునని, అందుకే ఆమెపై చర్యలను గానీ విమర్శలను గానీ పక్కన పెట్టాలని అనుకున్నట్లు సమాచారం.

విజయశాంతి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిసి కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. రాజశేఖర రెడ్డిని కలిసిన తర్వాత రాములమ్మపై తెరాస వర్గాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆ తర్వాత జరిగిన కార్యవర్గ సమావేశంలో విజయశాంతిపై కెసిఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. విజయశాంతిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని, ఆమెను గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఆ తర్వాత వైయస్ మరణించడం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావడం వంటి పరిణామాల వల్ల విజయశాంతి పునరాలోచనలో పడినట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుత వాతావరణంలో విజయశాంతిని దూరం చేసుకోవడం మంచిది కాదనే అభిప్రాయానికి కెసిఆర్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆమె తిరిగి తమ పార్టీలోకి వస్తే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. రోజా మాత్రం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో పనిచేయడానికి సిద్ధపడినప్పటికీ విజయశాంతి మాత్రం మౌనంగా ఉన్నారు. వైయస్ భౌతిక కాయాన్ని సందర్శించి ఆమె నివాళులర్పించారు. కానీ తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఏమీ మాట్లాడడం లేదు. అందుకే ఆమె పట్ల ప్రస్తుతానికి మౌనం వహించడమే మంచిదని తెరాస వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+