ఆశ వీడని వైయస్ జగన్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష విషయంలో రోశయ్య ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదని చెప్పడానికి సాక్షి టీవీ చానెల్ ద్వారా, పత్రిక ద్వారా ఆయన ప్రయత్నించారు. ఒక వైపు తెలంగాణకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తూనే మరో వైపు ప్రభుత్వం లోటు పాట్లను ఎత్తి చూపడానికి పూనుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసులు విరుచుకు పడిన దృశ్యాలను సాక్షి టీవీలో పదే పదే ప్రసారం చేశారు. ఒక విద్యార్థిని కొంత మంది పోలీసులు పడేసి 24 సార్లు కొట్టిన దృశ్యాలను పద్ధతి ప్రకారం ప్రసారం చేసిన తొలి చానెల్ సాక్షియే కావడం ఇక్కడ గమనార్హం. తెలంగాణ ఉద్యమాన్ని కట్టడి చేయడంలో కూడా రోశయ్య విఫలమయ్యారని చూపించడానికి తన మీడియా ద్వారా ఆయన ప్రయత్నించారు. గతంలో కూడా తిరిగి నక్సలైట్లు రాష్ట్రంలో తన తడాఖా చూపిస్తున్నారంటూ వార్తా కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటనను చూపిస్తూ భారీ కథనాన్ని సాక్షిలో ప్రచురించారు.
ఇకపోతే, తన తల్లి విజయలక్ష్మి నామినేషన్ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడిన వైనం ఆయన ఎంత అసహనంగా ఉన్నారనేది తెలియజేస్తుంది. తాను రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతానని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన సమావేశంలో ప్రకటించారు. ఒక రకంగా అధిష్టానాన్ని కూడా ధిక్కరించే రీతిలో జగన్ కు మద్దతు పలుకుతున్న కొండా సురేఖ, ఆనం వివేకానంద రెడ్డి సభలో మాట్లాడిన తీరు కూడా ఆ విషయాన్ని పట్టిస్తోంది. మొత్తం మీద, వైయస్ జగన్ సిఎం పదవి కోసం 2014 ఎన్నికల దాకా నిరీక్షించేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications