బాలయ్యకు భయపడే...

మిగతా పార్టీల మాట ఎలా తెలంగాణ విషయంలో అత్యంత దారుణమైన వైఖరిని అవలంబిస్తోంది తెలుగుదేశం పార్టీయే. అందుకు కారణం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్ప మరెవరూ కాదు. ప్రజాస్వామిక పద్ధతి పేర ఆయన నిర్ణయాలే పార్టీలో అమలవుతాయి. ఆ నిర్ణయాలు కూడా స్వయంగా చంద్రబాబు తీసుకుంటున్నవి కావు. ఆయన ఓ కోటరికి బందీ. అలాగే, ఒక సామాజిక వర్గానికి బందీ. ఆ సామాజిక ప్రయోజనాలే ప్రధానంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. కొద్ది మంది సంపన్నుల సలహా మేరకే ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విషయంపై స్వయంగా నన్నపనేని రాజకుమారి విమర్శలు చేశారు. సంపన్నులకు తప్ప ఆ పార్టీలో వేరే వారికి ప్రాధాన్యం లేదు.
తెలంగాణ విషయంలో ఆయనకు వెసులుబాటు లేకుండా పోయింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని అమలు పెట్టే స్వేచ్ఛ ఆయనకు లేదు. ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే తెలుగుదేశం పార్టీ పునాదులు కదులుతాయి. ఆయన నాయకత్వానికి కూడా ఎసరు రావచ్చు. అది బాలకృష్ణ రూపంలో ఎదురయ్యే ప్రమాదం ఉంది. నందమూరి కుమారులు బాలకృష్ణ, హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమే. అందువల్ల తన పదవిని కాపాడుకోవడానికి కూడా ఆయన తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తే కోస్తాంధ్ర నాయకులు నందమూరి బాలకృష్ణను ముందు పెట్టే ప్రమాదం ఉంది.
ఆ ప్రమాదం కారణంగానే చంద్రబాబు హేతుహరితంగా మాట్లాడుతున్నారు. దక్షిణ, ఉత్తర తెలంగాణల మధ్య విభేదాలు వస్తే ఎటు వైపు ఉంటారనే ప్రశ్నను చంద్రబాబు అమాయకంగా సంధించారు. ప్రజలకు, సమాజానికి న్యాయం చేయాల్సిన నాయకులు ఎటు న్యాయం ఉంటే అటు ఉంటారు. కానీ, నేటి రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం, తమ వర్గం ప్రయోజనాల కోసం న్యాయాన్యాయాల మాట మరిచిపోతున్నారు. అందుకు చంద్రబాబు మంచి ఉదాహరణ.












Click it and Unblock the Notifications