వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై 'చిదంబరం'

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వ్యవహార శైలి ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆయన ఒక్కొక్క అడుగే ఆచితూచి వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణపై అమలు చేయడానికి ఆయన ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నట్లు అర్థమవుతోంది. జనవరి 5వ తేదీ అఖిల పక్ష సమావేశం తర్వాత ఏమీ చర్యలు తీసుకోలేదని అనిపిస్తూ ఉంది. కానీ, రాజకీయ నాయకులతో చర్చల తర్వాత వివిధ వర్గాల అభిప్రాయాలను ఆయన రాబట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తిరగాల్సిన అనివార్యతను కల్పించడానికి జ్యుడిషియల్ కమిటీ వేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. అయితే దానికి రిటైర్డ్ న్యాయమూర్తుల ఎంపికలో సమస్యలు తలెత్తినట్లు కనిపిస్తోంది. నలుగురైదుగురు పేర్లను ప్రతిపాదించారని, అయితే వారెవరూ కమిటీ నేతృత్వం వహించడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. జస్టిస్ లక్ష్మణ్ వంటి పేర్లు బయటకు వచ్చాయి. కాని వారు అంగీకరించకపోవడం కేంద్ర ప్రభుత్వానికి సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసిన మంత్రి పి. చిదంబరాన్ని ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర నాయకులు తిట్లతో దీవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మాట్లాడిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లైపై కూడా దుమ్మెత్తి పోశారు. వాడెవడు, వీడెవడు అని మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించడమనండి, చూస్తాం అని కావూరి సాంబశివరావు లాంటి సీనియర్ నేతలు సంయమనం కోల్పోయి మాట్లాడారు. దాంతో చిదంబరం మాటేమో గానీ పిళ్లై తీవ్ర మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. చిదంబరం మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆ ప్రకటనలతోనే చిదంబరానికి మాత్రమే కాకుండా కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులకు కూడా కోస్తాంధ్ర నాయకుల ఆధిపత్య ధోరణి ఏమిటో అర్థమైనట్లు, రాష్ట్రాన్ని విభజిస్తే తప్ప తెలంగాణ ప్రజలకు నిష్కృతి లేదని, విభజన జరగకపోతే తెలంగాణలోనే కాకుండా కోస్తాంధ్రలోనూ కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని కాంగ్రెసు అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. రాయలసీమలో వైయస్ జగన్ వల్ల పార్టీకి జరగబోయే నష్టాన్ని జెసి దివాకర్ రెడ్డి వంటి నాయకులను దగ్గర చేర్చుకోవడం ద్వారా పూరించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ద్వారా తెలంగాణలో ప్రాబల్యాన్ని కొనసాగించాలనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఇప్పుడు విభజిస్తేనే రెండు ప్రాంతాల్లో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడి వచ్చే ఎన్నికల నాటికి తగిన బలాలను కూడగట్టుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల లోగా స్పష్టత రాకపోతే సమావేశాలను నడుపుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుందని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు సక్రమంగా జరగకపోతే ప్రభుత్వం స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల బడ్జెట్ ను ఆమోదించుకోవాలంటే పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉంటుంది. అందుకు తెలంగాణ ఏర్పాటుకు స్పష్టంగా ముందుకు రావడం తప్ప కేంద్రానికి మార్గం లేదు. అందుకు అనుగుణంగానే చిదంబరం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X