జగన్ పై హైకమాండ్ గెలిచిందా?

సోనియగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయం బోధపడడంతో ఎమ్మెల్యేలంతా ఆమె మాటకు కట్టుబడి ఉండాలనే స్థిర నిర్ణయానికి వచ్చారు. ప్రకాశం జిల్లా యాత్ర కోసం జగన్ గిద్దలూరులో మంత్రి బాలినేని, ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మినహా ఎమ్మెల్యేలెవరూ రాలేదు. కనీసం గిద్దలూరు మాజీ ఎమ్మెల్యేలు కూడా యాత్రలో పాలు పంచుకోలేదు. గిద్దలూరులో పోటీచేసి ఓడిపోయిన చంద్రశేఖర్ యాదవ్, కంభం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాత్రమే యాత్రలో పాల్గొన్నారు. అధిష్ఠానం కూడా జగన్ ప్రకాశం యాత్రను నిశితంగా పరిశీలిస్తోంది. ఆయన ప్రసంగాల్లో ఎక్కడా పార్టీ పేరుగానీ, అధినాయకురాలి పేరుగానీ ప్రస్తావించడం లేదు. కనీసం తన తండ్రి మరణంతో చనిపోయిన వారికి పార్టీ సాయం ప్రకటించిన విషయాన్ని సభల్లో ప్రకటిస్తారని నేతలు ఆశించినా జగన్ తీరు ఆ విధంగా లేదు. ఆయన మాటల్లో ఎక్కడా ఆ ప్రస్తావనే లేదు.
ఢిల్లీకి పిలిపించి స్పష్టంగా చెప్పడంతో ప్రకాశం జిల్లా శాసనసభ్యుల్లో ఓదార్పుపై అయోమయం వీడిపోయిందని అంటున్నారు. దానివల్ల వారు ధైర్యంగా ఓదార్పు యాత్రకు దూరంగా ఉండగలిగారనే మాట వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా కర్నూలు, కడప జిల్లాలకు సమీపంగా ఉండడంతో ఆ జిల్లాల నుంచి జగన్ ఓదార్పు యాత్రకు ప్రజలను తరలించారనే మాట వినిపిస్తోంది. వాహనాలు పెట్టి వారిని తరలించారని, అందుకే గిద్దలూరులో జనసందోహం కనిపించిందనే మాట వినిపిస్తోంది. ఏమైనా, అధిష్టానం జగన్ ఓదార్పు యాత్ర విషయంలో చాలా వరకు విజయం సాధించిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications