బాలయ్య కట్టిడికే హరికృష్ణ

నిజానికి, హరికృష్ణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుకు చెప్పకుండా ఆయన ఏ పనీ చేయరని అంటారు. అందులో నిజం లేకపోలేదు. అకస్మాత్తుగా ఆయన బహిరంగ ప్రకటన చేయడం వెనక చంద్రబాబు వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు హరికృష్ణకు సన్నిహితుడు కూడా. ఒక్క ఫోన్ ద్వారానో, ప్రైవేటుగానో హరికృష్ణ తన మాటను దయాకర్ రావుకు చెప్పవచ్చు. కానీ హరికృష్ణ చేయలేదు. అందుకు కారణం - బాలయ్యనే అనే మాట వినిపిస్తోంది.
సింహ విజయంతో బాలకృష్ణ దూసుకుపోతున్నాడు. రాజకీయంగా మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధపడుతున్నట్లు ఆయన మాటల ద్వారానే తెలుస్తోంది. అవరసరమైతే పార్టీ పగ్గాలు చేపడతానని, ప్రజల ఆదరణ ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని బాలయ్య తన సింహ విజయయాత్రలో అన్నారు. రాజ్యసభకు వెళ్లాలనే ఆకాంక్షను కూడా వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పర్యటనకు విరుగుడుగా బాలయ్య దాన్ని వాడుకునేలా చంద్రబాబు ప్రోత్సహించారని అంటున్నారు. అదే సమయంలో బాలయ్యకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హద్దులు దాటుతున్న బాలకృష్ణను కట్టడి చేయడానికి హరికృష్ణను చంద్రబాబు రంగంలోకి దించారనే మాట వినిపిస్తోంది. దీని కన్నా ముఖ్యంగా తన తెలంగాణ పర్యటనకు అటంకాలను తొలగించడానికి కూడా ఈ వివాదం పనికి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ వ్యవహారంలో హరికృష్ణ మాట్లాడడం వల్ల తెలంగాణ పర్యటన విషయంలో తనకు కూడా కాంగ్రెసు మద్దతు ఇవ్వాల్సిన స్థితిలో పడుతుందనే వ్యూహం హరికృష్ణ బహిరంగ లేఖ వెనక ఉందని అంటారు. మొత్తం మీద, హరికృష్ణను ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనే చంద్రబాబు వ్యూహం ఉందని అనుకోవచ్చు.












Click it and Unblock the Notifications