కెసిఆర్ క్లియర్

కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే కెసిఆర్ తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం కొద్ది కాలంగా వ్యక్తమవుతూ వస్తోంది. దానికి జవాబు చెప్పడానికే ఆయన ఆ విపరణ ఇచ్చారని భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని శిఖండిగా అబివర్ణించారు. తెలుగుదేశం పార్టీకి కార్పోరేట్ దోపిడీ పట్టడం లేదని విమర్శించారు. పార్టీలో కొంత ఆత్మవిమర్స ధోరణి కూడా కనిపించింది. అందుకే కెసిఆర్ పొత్తులపై ఒక స్పష్టత ఇచ్చారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని పార్టీ శ్రేణులు వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఆయన ఏకీభవించినట్లే కనిపిస్తున్నారు. భవిష్యత్తులో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓట్లు, సీట్ల రాజకీయంతో చిత్తైన కెసిఆర్ కు పొత్తులతో లాభం లేదనే అవగాహన కలిగినట్లుంది.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు గతంలో కన్నా ఈసారి కాస్తా భిన్నంగా జరిగినట్లు కనిపిస్తోంది. కెసిఆర్ మాత్రమే పూర్తిగా వేదికను ఆక్రమించుకుని ప్రసంగించే ధోరణి ఈసారి కనిపించలేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడారు కూడా. ఆచితూచి వ్యవహరించినట్లు అనిపించింది. అయితే, తెలంగాణ రాష్ట్రం రాకపోతే అంతర్యుద్దం తప్పదనే తన హెచ్చరికను మాత్రం ఆయన వదలలేదు.












Click it and Unblock the Notifications