సాక్షి చానెల్ ఎదురుదాడి

Sakshi
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి చానెల్ మరో సారి తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీ రావుపై ఎదురు దాడికి దిగింది. ది ఎగ్జైల్డ్ వార్తాకథనాన్ని తీసుకుని వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి కుట్ర జరిగిందంటూ టీవీ5, ఎన్టీవితో పాటు సాక్షి టీవీ చానెల్ ఆరోపిస్తూ ప్రసారం సాగించింది. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ కార్యాలయాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వైయస్ మృతికి కుట్రచేసినవారిలో అంబానీ సోదరులున్నారంటూ ఆరోపించడం, రిలయన్స్ కార్యాలయాలపై దాడి చేయడం కొద్ది గంటల వ్యవధిలో అరాచక పరిస్థితికి దారి తీసింది. దీంతో మీడియా పరిమితులపై, హద్దులపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఈ దాడుల వెనక వైయస్ జగన్ కుట్ర ఉందంటూ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ది ఎగ్జైల్డ్ అసలు స్వరూపాన్ని రామోజీకి చెందిన ఈనాడు దినపత్రికతో పాటు ఇతర తెలుగు దినపత్రికలు కూడా బయటపెట్టాయి. అయితే సాక్షి టీవీ చానెల్ మాత్రం రామోజీపైనే విరుచుకుపడ్డారు.

దాడులు జరిగినప్పటి నుంచి సాక్షి టీవీ చానెల్ తో పలువురు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా మాట్లాడుతూ రామోజీరావుపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. వారిలో ప్రముఖలు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు మాటలకు అర్థాలు తీస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాటలను బట్టి రిలయన్స్ తో చంద్రబాబుకు గల సంబంధాలు అర్థమవుతున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో రిలయన్స్ కు రామోజీ రావు సంస్థలో బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టిందంటూ సాక్షి దినపత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. వివిధ రూపాల్లో రిలయన్స్ నుంచి కోట్ల రూపాయలు రామోజీ సంస్థలోకి వచ్చాయని ఆరోపించింది. దాన్ని ప్రస్తుత చంద్రబాబు వ్యాఖ్యలు బలపరుస్తున్నాయనేది ఉండవల్లి వ్యాఖ్యల అంతరార్థం.

కాగా, మాజీ తెలుగుదేశం నేత రోజా కూడా సాక్షికి అండగా వచ్చింది. సాక్షి టీవీ చానెల్ ప్రతినిధి ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడించింది. సాక్షి టీవీకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. దాడులు జరిగిన తెల్లారి నుంచి జగన్ ఆత్మరక్షణ కోసమా అన్నట్లు సాక్షి టీవీ చానెల్ లో ఇంటర్వ్యూలు, వార్తా కథనాలు వస్తున్నాయి. జగన్ అనుచరుండు వంశీచందర్ రెడ్డి మెసేజ్ లు ఇచ్చి పథకం ప్రకారం రిలయన్స్ ఆస్తులపై దాడులు చేయించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు కూడా. తెలంగాణ నాయకులు కూడా జగన్ పై విరుచుకు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికే ఈ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారని వి. హనుమంతరావు వంటి తెలంగాణ కాంగ్రెసు నాయకులు విరుచుకుపడ్డారు. ఏమైనా, సాక్షి టీవీని జగన్ రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టించడానికి వేదికగా వాడుకుంటూ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా దాన్నే వాడుకుంటున్నారనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+