బాబాయ్ కి బెదిరిన వైయస్ జగన్

అయితే పులివెందులలో వివేకానంద పర్యటన జగన్ కు బెదిరిపోయినట్టున్నాడు. కడపలో మంచి పట్టు ఉన్న వివేకానంద వచ్చే ఎన్నికలలో తనకు ఎక్కడ గండికొడతాడనే ముందుచూపుతో జగన్ సైతం వివేకానంద బాటలో నడుస్తున్నారు. ఓ వైపు కాంగ్రెసు పార్టీనుండి బయటకు వచ్చిన జగన్ హైదరాబాదులో కొత్త పార్టీ పెట్టే వ్యూహంలో తలమునకలై ఉన్నాడు. తన వర్గం వారితో సంప్రతింపులు జరుపుతూ సలహాలు తీసుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో పార్టీ పెట్టాలనుకున్న జగన్ కు బాబాయ్ వివేకానంద నియోజకవర్గ స్థాయిలోనే కట్టుదిట్టం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పులివెందుల ఉప ఎన్నికల కోసం బాబాయ్ ప్రయత్నాలు చేస్తుంటే బెదిరిన జగన్ తాను పులివెందుల పయనానికి సిద్ధమయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే వైయస్ జగన్ ప్రయత్నాలను దెబ్బ తీయడానికి కాంగ్రెసు అధిష్టానం ఆయన పులివెందుల సీటుకే ఎసరు పెట్టేందుకు సిద్ధపడింది. పైగా, పులివెందులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సి రావడం వల్ల జగన్ రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకున ఏదో మేరకు గండి పడుతుందనేది కూడా కాంగ్రెసు అధిష్టానం ఆలోచనగా ఉందని చెప్పవచ్చు.
పార్టీ తరువాయి, ఉపపోరు విజయం ముందు అన్న విధంగా జగన్ పరిస్థితి తయారయింది. ఉప ఎన్నికల కోసం అనుచరులను కలిసి వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. అందులో భాగంగానే మంగళ, బుధవారాల్లో పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. జగన్ పర్యటనను ఆయన చిన్నాన్న భాస్కరరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురు, లింగాల, వేముల, చక్రాయపల్లిలతో పాటు పులివెందుల మున్సిపాలిటీ అనుచరులతో భేటీ అవుతారు.












Click it and Unblock the Notifications