మీ బొమ్మ పెట్టుకోండి: బొత్స వర్సెస్ కిరణ్

మచ్చ తెచ్చే విధంగా ఉన్న 108 వాహనాలపై దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ బొమ్మ ఉండటం ఆయన ప్రతిష్ట మసకబార్చే విధంగా ఉందని అవసరమైతే ముఖ్యమంత్రి బొమ్మ లేదా మరెవరి బొమ్మనైనా పెట్టుకోండి కానీ పని చేయని వాటిపై రాజీవ్ బొమ్మను ఉపయోగించి అవమానపర్చ వద్దని కోరారు. కేవలం రూ.100 కోట్లతో ప్రభుత్వానికి, కాంగ్రెసుకు పేరు తెచ్చే కార్యక్రమాన్ని ఇలా అబాసుపాలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
రాజీవ్ యువకిరణాల పైనా బొత్స సిఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. యువకిరణాల గురించి సిఎం వివరిస్తుండగా రాజీవ్ యువకిరణాల పథకం ఏమిటో దాని లక్ష్యం ఏమిటో అది ఎలా పని చేస్తుందో వివరించాలని మంత్రివర్గ సహచరులందరికీ దీనిపై అవగాహన కల్పించాలని నేను నాలుగైదు సార్లు అడిగినా మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఈ పథకం గురించి ఎవరితో ఒప్పందం చేసుకున్నారు, లాలూచీ ఏమిటి అని ప్రశ్నించారు. తాను పిసిసి చీఫ్‌గా, మంత్రిగా దీనిపై అడిగితే చెప్పకుంటే ఎలా అని ప్రశ్నించారు.
మరోవైపు మంత్రి ఆనం, డికె అరుణ చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావుపై సిఎంను నిలదీశారు. శంకర్ రావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సిఎం చెప్పారు. ఇలా మంత్రులు సిఎంను నిలదీస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రులు జానారెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి సమావేశం నుండి వెళ్లి పోవడం విశేషం. చివరగా జగన్, టిడిపి నేతలను ధాటిగా ఎదుర్కోవాలని మంత్రివర్గానికి ముఖ్యమంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications