వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగంకు చంద్రబాబు బ్రేకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు తెలంగాణ విషయంలో కట్టు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ విషయంలో ఇటీవల ప్రత్యేక శాఖ కోరిని ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు మళ్లీ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రత్యేక శాఖ పట్టుబట్టిన నాగం ఆ తర్వాత బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమన్వయ కమిటీకి సరేనన్నారు. ఇటీవల తెలుగుదేశం ఫోరం కన్వీనర్ హోదాలో నాగం తెలంగాణకు సంబంధించిన విషయాల్లో ఫోరందే తుది నిర్ణయమని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు.

దీనిపై బాబు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కింద ఫోరం పని చేస్తుందా, ఫోరం కింద పార్టీ పని చేస్తుందా అని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అంశంపై పార్టీది తుది నిర్ణయమని, ఫోరంది తుది నిర్ణయంగా ఉండకూడదని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. దానికి నాగం నేను ఫోరంది తుది నిర్ణయంగా చెప్పలేదని బాబుకు క్లారిఫై చేసినట్టుగా తెలుస్తోంది. తాను చెప్పిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరిస్తుందని నాగం బాబు ముందు ఆవేదన చెందారట. తెలంగాణ కోసం టిడిపి ప్రత్యేక శాఖ కోసం పట్టుబడిన నాగం బాబు హెచ్చరికతో వెనక్కి తగ్గినట్లుగానే ఇప్పుడు ఆయన తన వ్యాఖ్యలపై కూడా వెనక్కి తగ్గారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తన ఉద్దేశ్యాన్ని బయట పెట్టనప్పటికీ తెలంగాణ నేతలపై కూడా తన ఉద్దేశ్యాన్ని బలవంతంగా రుద్దుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓ సమయంలో నాగంపై ఘాటుగానే స్పందించారు బాబు.

తెలంగాణకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలతో రహస్యంగా భేటీ అయినప్పుడు బాబు అందరికీ ఫోన్ చేసి నాగం, కడియం, ఎర్రబెల్లిలకు మాత్రమే ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించలేదు. తెలంగాణపై అప్పుడప్పుడు మాట్లాడితే బాబు పట్టించుకోవడం లేదు. కానీ తెలంగాణ కోసం ప్రత్యేకంగా ప్రజల వద్దకు వెళ్లే పోరాటాలు చేయడాన్ని మాత్రం ఆయన వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. సెంటిమెంటు కొద్దికాలం ఉండి మళ్లీ మాయమవుతుందని ఆయన భావిస్తున్నందువల్లే తెలంగాణ నేతలు మాట్లాడటానికి బ్రేకులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమం చేసుకోవడానికి వీలుగా ఫోరానికి స్వేచ్ఛ ఇచ్చాం. మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసినా.. పార్టీ పరంగా సహకరించాం. కాని పార్టీ కన్నా ఫోరమే సుప్రీం అనే మాదిరిగా మీరు ప్రకటనలు ఇవ్వడం ఏం పద్దతి? ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో ఇదే మాదిరి ప్రకటనలు ఇస్తే ఇక పార్టీ ఎందుకు? అంటూ నాగంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారంట.

కాగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించాలన్న ప్రతిపాదనపై కార్యాచరణను ఈ నెల 10న ఖరారు చేద్దామని నాగంకు చంద్రబాబు సూచించారు. చంద్రబాబు ఉద్దేశ్య పూర్వకంగా నాగంలాంటి నేతలకు బ్రేకులు వేయడంతో తెలంగాణ టిడిపిలో విభేదాలు రాజుకుంటున్నాయి. అందుకే నాగంపై ఇటీవల మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఇఫ్పుడు మండవ వెంకటేశ్వరరావు మండిపడుతున్నారు. ఫోరం రచ్చబండను బహిష్కరించినప్పటికీ తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేలు పాల్గొనటంపై నాగం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X