జగన్‌కు అడ్డుపడుతున్న బాబు వైఖరి?

Chandrababu Naidu-YS Jagan
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని వడగొట్టాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరే అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించి, మధ్యంతర ఎన్నికలను ఆహ్వానించలేని చంద్రబాబు పరిస్థితి వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగించే అవకాశాలున్నాయి. ప్రతిపక్షమంతా ఏకమైతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి రాదు. అలాంటి అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు, తెరాస శాసనసభ్యులు గవర్నర్‌కు లేఖ ఇస్తే తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని తెలుగుదేశం నాయకులు కొలికి పెడుతున్నారు.

కాంగ్రెసుకు చెందిన కనీసం 70 మంది శాసనసభ్యులు మద్దతు ఉపసంహరించుకుంటే తప్ప ప్రభుత్వం ప్రమాదంలో పడే పరిస్థితి లేదని అంటున్నారు. జగన్‌ వర్గానికి చెందిన 29 మంది, 12 మంది తెరాస, టిడిపిని వీడిన ఐదుగురు, తెరాసలో తాజాగా చేరిన ముగ్గురు శానససభ్యులకు మరింత మంది కాంగ్రెసు శాసనసభ్యులు కలిస్తే మాత్రమే ప్రభుత్వానికి ముప్పు ఉంటుంది. ఆ రకంగా చూస్తే కనీసం 7-0 మంది కాంగ్రెసు శాసనసభ్యులు ఫిరాయించాల్సి ఉంటుంది. ఈ స్థితిలో ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించేలా చేయాలనేది కెసిఆర్, జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకు తెలుగుదేశం పార్టీని ఈ ఇద్దరు నాయకులు రెచ్చగొట్టే పనికి పూనుకున్నారు. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారంటూ పదే పదే విమర్సలు చేస్తున్నారు. అలా కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవడానికైనా చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు వస్తారనేది ఆ ఇద్దరు నాయకుల ఆలోచన.

అయితే, జగన్ వర్గం శానససభ్యులు మద్దతు ఉపసంహరించుకుంటూ గవర్నర్‌కు లేఖ ఇవ్వాలనే షరతు పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించే గండం నుంచి గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తోంది. జగన్ వర్గం శాసనసభ్యులు గవర్నర్‌కు లేఖ సమర్పించే స్థితిలో లేరు. అలాంటి లేఖ సమర్పిస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వచ్చి తమపై కర్ణాటకలో మాదిరిగా అనర్హత వేటు పడుతుందనే భయంతో వారున్నారు. తెలుగుదేశం పార్టీ మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడమే కిరణ్ కుమార్ రెడ్డికి శ్రీరామరక్షగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+