కెసిఆర్‌ది తప్పించుకునే ప్రయత్నమా?

k chandrasekhar rao
పోలవరం టెండర్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పించుకునే ప్రయత్నాలు చేశారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు. కెసిఆర్ తాము, తెలంగాణ ప్రజలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఉద్దేశ్య పూర్వకంగా నీచంగా విరుచుకు పడ్డారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అని చెప్పుకునే టిఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడులు పెట్టిన రాజాంకు పోలవరం టెండర్లు దక్కిన ష్యూ కంపెనీలో పెట్టుబడులు ఉన్నాయా? లేవా? స్పష్టంగా చెప్పకుండా బాబుపై విమర్శలు చేయడానికే ప్రెస్ మీట్ పెట్టినట్లుగా ఉందని విమర్శించారు.

తెలంగాణ కోసమే ఉద్యమిస్తున్నామని, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికే సిద్ధపడ్డానని చెబుతున్న కెసిఆర్ రాజాం పెద్ద వ్యాపారి అని ఆయనకు ఎక్కెడెక్కడ కాంట్రాక్టులు ఉన్నాయో తనకు తెలియాల్సిన అవసరం లేదని చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే పోలవరం టెండర్లు రాజాం పెట్టుబడులు పెట్టిన ష్యూ కంపెనీకి దక్కేందుకు టిఆర్ఎస్ అగ్ర నేతలు తెరచాటు ప్రయత్నాలు చేశారో లేదో చెప్పలేదని అలాగే టెండర్ల కోసం సమ్మెను తాకట్టు పెట్టిన అంశంపై కూడా ఆయన సమాధానం చెప్పలేదని అంటున్నారు. కెసిఆర్ వేటికి సమాధానాలు చెప్పకుండా దాటవేసే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుపై నమస్తే తెలంగాణ పత్రికలో ప్రముఖంగా వార్త వస్తే కెసిఆర్ అది తనకు తెలియదని దానిపై నమస్తే తెలంగాణ సంపాదకుడిని అడగాలని, అయినా వార్తను వార్తగా రాయటంలో తప్పేమిటని చెప్పడం తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందంటున్నారు. టెండర్లు ఎలా వేస్తారో తనకు తెలియదన్న వ్యాఖ్యలను కూడా వారు తప్పు పడుతున్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో స్వచ్ఛంగా ఉన్నానన్న కెసిఆర్ తన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎందుకు ప్రకటించటం లేదని ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ పోలవరం విషయంలో తమ సవాళ్లకు స్పందించకుండా తప్పుడు ఆరోపణలు చేసి ఉద్దేశ్య పూర్వకంగా ఇష్యూ నుండి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+