కిరణ్ కుమార్ రెడ్డి సహనం కోల్పోవడం వెనక..

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోజు రోజుకూ సహనం కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రోశయ్యను తప్పించి కిరణ్ కమార్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఆయనేదో పొడిచేస్తారని అధిష్టానం భావించే ఆ పని చేసింది. కానీ పరిస్థితిలో ఏ విధమైన మార్పు లేదు. మంత్రులు, శాసనసభ్యులు రోశయ్యకు మాదిరిగానే కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సహకరించడం లేదు. రఘువీరా రెడ్డి వంటి ఇద్దరు ముగ్గురు మంత్రులు తప్ప కిరణ్ కమార్ రెడ్డి మాట వినేవారు లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమం విషయంలో కూడా రోశయ్య కన్నా మించి కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీ లేదు.

పరిస్థితిలో మార్పు లేకపోగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చిన చిరంజీవి అదును చూసి అధికారానికి చేరువ కావాలని కాచుకుని కూర్చున్నారు. బొత్స సత్యనారాయణ, చిరంజీవి కలిసి తనక పదవికి ఎసరు పెడతారనే భయం కూడా ఆయనను కలిచివేస్తున్నట్లు చెబుతున్నారు. అస్థిరత కొట్టుమిట్టాడుతోంది.

ఇటీవల మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వ్యవహరించిన తీరు, గురువారం సాయంత్రం కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో వ్యవహరించిన తీరు ఆయన సహనం కోల్పోతున్నారని చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు. సకల జనుల సమ్మెను విరమించాలని చెప్పడానికి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన గమ్మత్తుగా వ్యవహరించారు. తాను మాట్లాడడం ముగించిన తర్వాత మీడియా ప్రతినిధులను ప్రశ్నలు వేయనీయలేదు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోడం వేరైతే ప్రశ్నలనే అహ్వానించడానికి నిరాకరించారు. మీరేదో అడుగుతారు, నేను మాట్లాడిన విషయాలకు పెడర్థాలు తీస్తారు, అందువల్ల ప్రశ్నలను తీసుకోదలుచుకోలేదు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆ విధంగా అనడం నిజంగా ఆశ్చర్యకరమే.

కాగా, గురువారం సాయంత్రం కాంగ్రెసు తెలంగామ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌పై చేసిన వ్యాఖ్యలు కిరణ్ కుమార్ రెడ్డికి తగినవేమో గానీ ఓ ముఖ్యమంత్రికి తగినవి కావనే మాట అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వైపుల నుంచీ విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు వస్తుంటాయి. పైగా, ఆందోళనలు చెలరేగుతున్నప్పుడు అవి ఎక్కువగా వస్తాయి. పొన్నం ప్రభాకర్ ఏదో మాట్లాడారని దురుసుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం స్థాయిని తగ్గించుకోవడమే. హుందాగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి సహనం కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+