కెసిఆర్‌కు సోనియా ఆఫర్

ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు ప్రతిపాదనలు అందినట్టుగా తెలుస్తోంది. అయితే కెసిఆర్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే తప్ప కాంగ్రెసును సమర్థించే పరిస్థితిగానీ, విలీనం అయ్యే పరిస్థితిగానీ లేదు. కాబట్టి సోనియాగాంధీ టిఆర్ఎస్ విలీనం కోసం ఐదు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం తెలంగాణ సై అంటే టిఆర్ఎస్‌ను కాంగ్రెసులో విలీనం చేయడానికి కెసిఆర్ సంసిద్ధత వ్యక్తం చేస్తాడు. అయితే తెలంగాణను అప్పుడే ఇవ్వడం మాత్రం కుదరదు. ఐదు రాష్ట్రాల్లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కెసిఆర్ ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు. ఆ తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత కాస్త సమయం తీసుకొని కేంద్రం తెలంగాణను ప్రకటిస్తుంది.
టిఆర్ఎస్‌ను కాంగ్రెసులో విలీనం చేయడం ద్వారా కెసిఆర్ కుటుంబాన్ని పదవులు వరించనున్నాయి. కెసిఆర్‌కు జాతీయస్థాయిలో ఏఐసిసిలో జనరల్ సెక్రటరీ పదవిని ఇస్తారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు సైతం రాష్ట్ర ప్రభుత్వంలో, పార్టీలో మంచి ప్రాధాన్యం కల్పిస్తారు. కెసిఆర్ సైతం కాంగ్రెసులో విలీనం ప్రస్తావనే లేదని ఖరాఖండిగా చెబుతున్నప్పటికీ తెలంగాణ ఇస్తమానే అతి ప్రాధాన్యమైన హామీతోపాటు కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని చెబితే వీలీనానికి అడ్డంకులు ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కాంగ్రెసును బజారుకు ఈడుస్తామని చేప్పిన కెసిఆర్ ప్రస్తుత మౌనం వెనుక ఆ కోణం దాగి ఉందనే వారూ ఉన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కెసిఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ కూడా కలిసి వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications