తెలంగాణ ముఖ్యమంత్రిపై అప్పుడే చర్చలు

దీంతో అప్పుడే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ హాట్ టాపిక్‌గా మారి పోయింది. ప్రధానంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సామాజిక స్పృహ కలిగిన కొండా లక్ష్మణ్ బాపూజీని రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండుతో ముందుకు వచ్చారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ వర్గాలకు కలుపుకు పోయే రకమని అన్ని వర్గాలకు ఆయనే దగ్గరి బంధువని కాబట్టి ఆయనను సిఎం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సైతం మొదటి నుండి దళితులకు ముఖ్యమంత్రి పీఠం, అల్ప సంఖ్యాక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. కెసిఆర్ వ్యాఖ్యలపై తమకు నమ్మకం లేదని తెలంగాణ ఏర్పడితే తన తనయుడు కల్వకుంట్ల తారక రామారావునే సిఎం చేస్తామని చూస్తున్నారని అందుకే రాష్ట్రం రాకముందే ముఖ్యమంత్రిని ఎవరూ చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
దళితులకు సిఎం, మైనార్టీలకు డిప్యూటీ అన్న కెసిఆర్ వ్యాఖ్యలపై నమ్మకం లేక పోవడమనే విషయాన్ని పక్కన పెడితే అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని మందకృష్ణ వ్యాఖ్యానించడాన్ని కూడా కొందరు తప్పు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. పిల్ల పుట్టక ముందే కుల్ల తయారు చేసిన చందంగా ఆయన వ్యాఖ్యలున్నాయంటున్నారు. అంతేకాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ ఖచ్చితంగా గౌరవనీయులేనని అందులో ఎవరికీ సందేహం లేదని కానీ తొంబయ్యేడేళ్ల వయసులో ఆయన రాష్ట్రాన్ని పరిపాలించగలరా అనే అంశాన్ని మందకృష్ణ ఆలోచించారా అనే ప్రశ్నలు పలువురిలో తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications