కష్టకాలంలో జగన్ రెండో దశ ఓదార్పు

YS Jagan
తన ఆస్తులపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లు విచారణ జరుపుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కృష్ణా జిల్లాలో రెండో దశ ఓదార్పు యాత్ర నిర్వహించాలని అనుకుంటున్నారు. విచారణ వల్ల ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడవచ్చుననే ఉద్దేశంతో ఈలోగానే సాధ్యమైనంత ఎక్కువ పర్యటించి, ప్రజల మనసును దోచుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో కృష్ణా జిల్లాలో రెండో దశ ఓదార్పు యాత్ర సుదీర్ఘంగా చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. దాదాపు 45 రోజుల పాటు ఈ యాత్రను ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

కృష్ణా జిల్లాలో జగన్ ఆగస్టు 15వ తేదీన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. బుధవారం హైదరాబాదు తిరిగి వచ్చారు. కృష్ణా జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో పూర్తిగా, ఓ నియోజకవర్గంలో పాక్షికంగా ఆయన పర్యటించారు. శుక్రవారం జగన్ పులివెందుల వెళ్లి వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఒక రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరై హైదరాబాదు తిరిగి వస్తారు. ఐదో తేదీన తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాకు వెళ్లి రెండో దశ ఓదార్పు యాత్ర చేపడతారు.

నిజానికి, కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను ముగిస్తూ బుధవారం విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించాల్సి ఉండింది. కానీ, రెండో దశ కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకోవడంతో బహిరంగ సభను వాయిదా వేసుకున్నారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండడం వల్లనే కృష్ణా జిల్లాలో రెండో దశ ఓదార్పు యాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+