చిరుతో న్యాయం జరిగేనా?

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసులోకి వెళ్లిన తర్వాత తన పార్టీ శాసససభ్యులను, ముఖ్య నేతలను సంతృప్తిపరుస్తారా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. వచ్చే మంత్రివర్గ విస్తరణలో పిఆర్పీకి చెందిన ఇద్దరు నేతలకు మంత్రి పదవులు రానున్నాయనే వాదనల నేపథ్యంలో అందులో కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్యకు ఓ పదవి రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ వాదనలు రాగానే కడప జిల్లా కాంగ్రెసు నేతలు తమ ఆక్రోషాన్ని వెళ్లగక్కారు. పార్టీలో మరెవరికీ మంత్రి పదవి ఇచ్చినా ఫరవాలేదు. కానీ రామచంద్రయ్యకు మాత్రం ఇస్తే ఊరుకునేది లేదని కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు హెచ్చరించారు. వీరి వెనుక ఆ జిల్లా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఉన్నాడని వినిపిస్తోంది. అయితే చిరంజీవి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా వారికి హెచ్చరికలు పంపేలా చేశారు.

ఇలా కాంగ్రెసు నుండి వచ్చే విమర్శలను చిరంజీవి అధిష్టానం వద్ద తనకు ఉన్న పలుకుబడితోనో, రాష్ట్ర నేతలతో తనకు ఉన్న సాన్నిహిత్యంతోనో ఎదుర్కొంటాడు. కానీ ప్రజారాజ్యం పార్టీలోని అసంతృప్తులను ఎలా ఎదుర్కొనగలడనేది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. సహజంగా రాజకీయ చాతుర్యం ఒంటబట్టని చిరంజీవి తన ఎమ్మెల్యేలను సంతృప్తి పర్చలేడనే వాదనలు వినిపిస్తున్నాయి. సి.రామచంద్రయ్యకు పదవి ఇవ్వడంపై కేవలం కడప కాంగ్రెసు నుండే విమర్శలు రావడం లేదు. కడప పిఆర్పీ నుండి కూడా వ్యతిరేకత వస్తుంది. బొత్సతో ఫోన్ చేయించి కడప కాంగ్రెసు విమర్శలను సద్దుమణిగేలా చేసిన చిరంజీవి పిఆర్పీ నేతలకు సర్ది చెప్పగలరా అనేది చూడాలి. ఇన్నాళ్లూ టూర్లో ఉన్న చిరు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అసంతృప్తులు బయటపడినట్లుగా తెలుస్తోంది.

చిరు కాకుండా పదిహేడు మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ శోభానాగిరెడ్డి జగన్ వైపు వెళ్లారు. మిగిలిన పదహారు మందిలో తెలంగాణ అనీల తెలంగాణ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్రకు చెందిన పలువురు కూడా మంత్రి పదవి కోసం పోటా పోటీగా ఉన్నారు. అందుకు వారు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెసులో విలీనం కారణంగా కొందరు ఎమ్మెల్యేలు ఉన్న చోట బలమైన కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీంతో చిరుతో ఉంటే తమకు 2014లో సీటు ఖాయమవుతుందా అనే అనుమానం కూడా కొందరు ఎమ్మెల్యేలలో ఉంది. ఇప్పుడు మంత్రి పదవి, వచ్చే ఎన్నికల్లో సీటు, చిరుతో వెళితే తమకు కాంగ్రెసులో ప్రాధాన్యత ఉంటుందా ఇలా పలు ప్రశ్నలు పిఆర్పీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలలో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విలీనం, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ తర్వాత చిరుతో ఎందరు నేతలు ఉంటారా చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+