వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో పోటీకి జగన్ వెనక్కి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పోటీకి మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 3వ తేదినుండి 9వ తేది వరకు కేంద్ర ప్రభుత్వం అవినీతిపై జాతీయ పార్టీలతో కలిసి ఆందోళనలు సాగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 3వ తేదిన మొదట ఆర్టీవో కార్యాలయాల వద్ద ప్రారంభమయ్యే ఆందోళనలు 9వ తేదిన ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9వ తేదిన భారీ ఎత్తున న్యూఢిల్లీలో జాతీయస్థాయి నేతలతో కలిసి బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాల అవినీతితో పాటు సామాన్యులకు గుదిబండగా మారిన ధరల పెరుగుదలపై కూడా ఆందోళన చేస్తారు.

ఆయితే చంద్రబాబు 9వ తేదిన ఢిల్లీలో బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో జగన్ తన పోలవరం వేగవంత నిర్మాణం కోసం చేపట్టనున్న హరితయాత్రను పెంచారు. మొదట 9వ తేదిన పోలవరంలో యాత్రను ముగించి బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే అదే 9వ తేదిన బాబు ఢిల్లీలో యాత్ర చేయడంతో జగన్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో జగన్ ఒక అడుగు వెనక్కి వేసి యాత్రను 10వ తేది వరకు పొడిగించారు. అయితే బాబు ధర్నాకు, జగన్‌కు సంబంధం ఏమిటా అంటే జగన్ ఏ టార్గెట్‌తో అయితే లక్ష్యదీక్ష, జనదీక్ష, జలదీక్షలు చేపట్టారో అదే తాపత్రయంతో ఈ హరితయాత్రను నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అదే 9వ తేదిన ఢిల్లీలో చంద్రబాబు బహిరంగ సభ ఉన్నందున జాతీయమీడియాగానీ, రాష్ట్ర మీడియా కానీ దానిపైనే దృష్టి సారిస్తుంది. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, తొందరగా ముఖ్యమంత్రి కావాలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్, చంద్రబాబు ఢిల్లీ సభ కారణంగా మీడియా తనపై దృష్టి సారించదనే ఉద్దేశ్యంతోనే తన యాత్రను ఒకరోజుకు పెంచుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. దీంతో 9వ తేదిన జరగాల్సిన పోలవరం బహిరంగ సభ 10వ తేదికి మారినట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X