24న జగన్ బలం తేలుతుందా?

శాసనసభ్యులందరూ జారుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యుల సమావేశం జరగనుంది. శానససభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు వారు సమావేశమవుతున్నారు. ఈ సమావేశం ద్వారా వైయస్ జగన్ వెంట ఉన్న అసలు సిసలు శాసనసభ్యుల సంఖ్య ఏమిటో తేలిపోతుందని అంటున్నారు. ఆ విషయాన్ని తేల్చుకోవడానికే జగన్ సమావేశం నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. గత ప్రజారాజ్యం నుంచి వచ్చిన శోభా నాగిరెడ్డి, తెలుగుదేశం నుంచి వచ్చిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి కొద్ది మంది జగన్ వైపు ఉంటారని, మిగతా వారిలో చాలా మంది కాంగ్రెసులోకి తిరిగి వస్తారని అనుకుంటున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి శాసనసభ శీతాకాలం సమావేశాలు జరగనున్నాయి. దాదాపు వారం ముందుగానే జగన్ శాసనసభ్యుల సమావేశం జరుగుతోంది. జగన్ తన బలాన్ని తేల్చుకోవడానికే ఈ రకమైన సమావేశం పెడుతున్నారనే ప్రచారం ఉంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారానే టికెట్లు పొంది గెలిచిన శాసనసభ్యులు ఇప్పటి వరకు వైయస్ జగన్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. అటువంటివారిలో బాబూరావు, బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వంటివారే కాంగ్రెసు వైపు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదంతా జగన్‌కు వ్యతిరేకమైన మీడియా చేస్తున్న ప్రచారమని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం ప్రతిపాదిస్తే ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన వ్యూహాన్ని జగన్ వర్గం ఎమ్మెల్యేలు అనుసరిస్తానే ప్రచారం ఇటీవలి దాకా ముమ్మరంగా సాగుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications