వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు చెక్: ఆ 17 సీట్లపైనే బొత్స దృష్టి

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
ప్రస్తుతం జరుగుతున్న ఐడు శాసనసభా నియోజకవర్గాలను పక్కన పెట్టేసి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటు వేసిన తర్వాత 17 స్థానాలకు ఉప ఎన్నికలు రావడం ఖాయమైంది. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పైచేయి సాధించి, ఆ 17 స్థానాల విషయంలో తాను పట్టు బిగించడం ద్వారా పార్టీపై ఆధిపత్యం సాధించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ 17 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను తయారు చేసి ముందుగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు అందించినట్లు చెబుతున్నారు.

మహ బూబ్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో తనకు చుక్కెదురైన తర్వాత కిరణ్‌కు చెక్‌ పెట్టే దిశగా బొత్స పావులు కదుపుతున్నారు. రాజ్యసభ అభ్యర్థులతో పాటు ఉప ఎన్నికలు జరిగే అవ కాశమున్న అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను బొత్స ముందుచూపుతోనే పార్టీ హైకమాండ్‌కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అభ్యర్థుల గురించి చర్చించకుండానే జాబితాను అందజేశారంటే సిఎంకు చెక్‌పెట్టేందుకేనని అంటున్నారు. ఈ జాబితాలో సొంత వర్గం ఉండేలా బొత్స జాగ్రత్తలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి సతీమణి విజయలక్ష్మిని నిలబెట్టాలని బొత్స సత్యనారాయణ యోచించారు. ఇదే విషయమై సిఎంతో ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ బొత్స ఢిల్లీ పయనం అయిన వెంటనే విజయ లక్ష్మిని కాదని ముత్యాల ప్రకాష్‌ను పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అయినా బొత్స మౌనంగానే ఉండిపోయారు. కానీ ఈసారి ముఖ్యమంత్రికి ఆ అవకాశం ఇవ్వాలని ఆయన అనుకోవడం లేదు. మెజార్టీ స్థానాల్లో తన సొంత వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకొని పార్టీపై పట్టుసాధించాలని ఆయన యోచిస్తున్న ట్లు సమాచారం.

English summary
It is said that PCC president Botsa Satyanarayana has concentrated on 17 seats forced to vacate by YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X