టార్గెట్ అదే: బొత్స వ్యూహం, కిరణ్ ప్రతివ్యూహం

Kiran Kumar Reddy-Bosta Satyanarayana
కాంగ్రెసు పార్టీలో అసమ్మతి కథ చివరి దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య అంతర్గతంగా ఉన్న పోరు హఠాత్తుగా ప్రత్యక్ష యుద్ధంగా మారినట్లు కనిపిస్తోంది. కిరణ‌్‌ను దించాలని బొత్స, పిసిసి చీఫ్‌గా తొలగించాలని సిఎం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరి ఎత్తులు పైఎత్తులకు ఢిల్లీ వేదికగా మారడం విశేషం. ఇటీవల వివిధ కారణాలు చూపుతూ ఢిల్లీ వెళ్లిన బొత్స, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి తదితరులు సిఎంను మార్చాలని అధిష్టానం వద్ద చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గతంలో తాను కిరణ్‌ను తొలగించే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన కూడా ఈ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారట. కిరణ్ పనితీరుతో పార్టీలో ఎవరూ సంతృప్తికరంగా లేరని, ఒక్క ఎమ్మెల్యే, మంత్రి అయినా ఆయన పట్ల సానుకూలతతో లేరని ఆయనను వెంటనే తొలగించాలని ఫిర్యాదులు చేస్తున్నారని అంటున్నారు.

కిరణ్ సోదరులు కూడా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వెళుతున్నాయట. ఆయన వల్ల రాష్ట్రంలో ప్రభుత్వానికి, పార్టీకి నష్టమని, మంత్రివర్గ విస్తరణకు కూడా అనుమతివ్వవద్దని అధిష్టానం వద్ద చెప్పారని అంటున్నారు. మరో విషయమేమంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత కొత్త ముఖ్యమంత్రిని నియమించాలని పలువురు అధిష్టానాన్ని కోరారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో శంకర రావు సిఎంను మార్చాలంటూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను మాత్రం అలాంటి లేఖ రాయలేదని ఆయన అప్పుడే వివరణ ఇచ్చుకున్నారు. తనను గద్దె దింపేందుకు జరుగుతున్న వ్యూహాలకు సిఎం కిరణ్ కూడా ధీటుగానే ప్రతివ్యూహాలు రచిస్తున్నారట. ఇందులో భాగంగానే ఇటీవల బొత్సపై పలువురు నేతలు ఫిర్యాదు చేశారని అంటున్నారు.

బొత్స పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఎవరూ ఉత్సాహంగా పని చేయడం లేదని, మంత్రులపై ఆయన అప్పుడే పెత్తనం చేస్తున్నారని, పలు విషయాల్లో మంత్రులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అధిష్టానానికి చెబుతున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు ఫ్యాక్స్‌లు, హైదరాబాద్‌కు పెద్ద నేతలు వచ్చినప్పుడే ఫిర్యాదులు చేసిన కిరణ్ వర్గం తాజాగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేసేందుకు కూడా సన్నద్ధమవుతోందట. బొత్సను మారిస్తే కోస్తాలో అసలు కాపు వర్గానికి చెందిన నేతకు ఆ పదవి ఇవ్వవచ్చునని, ఆయన హడావుడి వల్ల కాపులే పార్టీకి దూరమయ్యే అవకాశముందని చెప్పనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఇరువురు ఒకరికొకరిని పదవుల నుండి దింపడమే టార్గెట్ చేసుకున్నారని కొందరు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+