గురువుకు 'హ్యాండ్'!: బాబుకు దగ్గరవుతున్న మోహన్‌బాబు

తన గురువును కాంగ్రెసు విస్మరించిన కారణంగానే ఆయన దశాబ్దానికి పైగా టిడిపికి, చంద్రబాబుకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ పార్టీకి దగ్గరవుతున్నారని అంటున్నారు. మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభకు వెళ్లారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మరణం, తదనంతర పరిణామాలతో ఆయన చంద్రబాబుకు దూరమయ్యారు. ఆయన టిడిపితో సంబంధాలు ఎప్పుడో తెంచుకున్నారు. రాజకీయాల వైపు చూడలేదు. అయితే దాసరికి రాజ్యసభ విషయంలో కాంగ్రెసు మొండి చేయి చూపిన అనంతరం ఆయన చంద్రబాబును తన పుట్టిన రోజు వేడుకలకు పిలవడం టిడిపికి దగ్గరవుతున్నారనడానికి సంకేతాలే అని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు త్వరలో ఖాళీ అవుతున్న తిరుపతి స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. మరోవైపు మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు కాబట్టి ఇది యాదృచ్ఛికంగానే జరిగి ఉంటుందని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications