కిరణ్, నరసింహన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

ఫైలును తిరిగి పంపిన తర్వాత ముఖ్యమంత్రి గవర్నర్‌తో మాట్లాడలేదు. నియామకాలపై గవర్నర్‌ను ఒప్పించడానికి ఆయన ప్రయత్నాలు చేయలేదు. ఇతర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషనర్ల నియామకాలకు సంబంధించిన వివరాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇతర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమీషనర్ల నియామకాల గురించి వివరిస్తూ, సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో గవర్నర్‌కు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి గవర్నర్‌కు లేఖ రాసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్రల్లో సమాచార హక్కు కమిషనర్ల నియామకాలు జరిగిన తీరును ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ మూడు రాష్ట్రాలు కూడా కాంగ్రెసు పాలనలో ఉన్నాయి. గత రాజకీయ సంబంధాలను కారణంగా చూపి సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడాన్ని గవర్నర్లు తిరస్కరించిన సందర్భాలు ఆ రాష్ట్రాల్లో ఉన్నాయా అనే విషయంపై ఆయన దృష్టి పెట్టారు.
నియామాకల విషయంలో పునపరిశీలన జరపాలని ముఖ్యమంత్రిని గవర్నర్ కోరే అవకాశం రాజ్యాంగపరంగా లేదని అంటున్నారు. తన నిర్ణయాల విషయంలో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలం వైస్ చాన్సలర్‌గా కుసుమకుమారి తొలగింపు విషయంలోనే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడిగా దిలీప్ రెడ్డి నియమాకాన్ని తోసిపుచ్చడం వంటి విషయాల్లో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సమాచార హక్కు కమిషనర్ల నియామకాలను తప్పుపడుతూ నరసింహన్ ఫైలును వెనక్కి పంపడం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications