వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ!: చంద్రబాబుకు సిపిఐ రాంరాం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Narayana
తెలుగుదేశంతో ఎన్నికల పొత్తులకు సిపిఐ రాంరాం చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సన్నిహితానికి ఇక చెక్ చెప్పాలని సిపిఐ రాష్ట్ర మహాసభల్లో ప్రతినిధులు అభిప్రాయపడినట్లగా సమాచారం. చంద్రబాబు ఇంటికి ఆ పార్టీ అగ్రనేత బర్దన్ వెళ్లడాన్ని సిపిఐ నేతలు తప్పు పట్టడం చూస్తుంటే టిడిపితో తెగతెంపులకు సిద్ధపడ్డట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపితో పొత్తు వద్దని అన్ని జిల్లాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారట. మన పార్టీ తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇస్తుంటే చంద్రబాబు తన వైఖరి ఇప్పటి వరకు స్పష్టంగా తెలియజేయలేదని, రాష్ట్రంలోని ప్రధాన సమస్య పైనే ఆయన తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించనప్పుడు టిడిపితో వెళ్లడం పార్టీకి నష్టమేనని వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు భావించారని సమాచారం. అంతేకాకుండా తన హయాంలో పలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారని, నాడు వ్యవసాయం దండుగ అన్నారని, సరళీకృత ఆర్థిక విధానాలను ఆయన తీసుకు వచ్చారని వారు ఈ సందర్భంగా ప్రస్తావించినట్లుగా సమాచారం.

తెలంగాణ అంశం విషయంలో మనం ఇక నుండి మరింత దూకుడుగా ఉండాల్సి ఉంటుందని అలాంటప్పుడు టిడికి దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డారట. ఓసారి టిడిపితో, మరోసారి కాంగ్రెసుతో ఇలా ఒక్కోసారి ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ పరిమితమైన స్థానాల్లో పోటీ చేయడం వల్ల మనకే ఎక్కువ నష్టం జరుగుతోందని, అది పార్టీ ఉనికికే ప్రమాదంగా పరిగణమిస్తోందని మరో నాయకుడు చెప్పారు. 2009 ఎన్నికల్లోనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంతో కలిసి పోటీ చేయాలని భావిస్తే జాతీయ విధానమంటూ బలవంతంగా మహాకూటమిలో చేర్పించారని, దానివల్లే నష్టపోయామని చెప్పారు. భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయవద్దని దూరదష్టితో పొత్తులపై నిర్ణయాలు తీసుకోవాలని ఇంకో నేత అభిప్రాయపడ్డారు. సిపిఐ టిడిపితో జతకడుతుందనే సంకేతాలు ఇవ్వవద్దని ఓ ప్రతినిధి చెప్పారు. ప్రతినిధుల వ్యాఖ్యలు చూస్తుంటే టిడిపికి సిపిఐ దూరంగా ఉండాలనే భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తెలంగాణకు అనుకూలంగా గత జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు చేసినా ఉద్యమ కార్యాచరణ లేకపోవడంతో ప్రజలకు విశ్వాసం కలగడం లేదని తెలంగాణ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా కార్యాచరణ రూపొందించాలని చాలామంది పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అవసరమైతే టిఆర్ఎస్, బిజెపి కన్నా ముందుండాలని కొందరు అన్నారని తెలుస్తోంది. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర మనకుందని, పార్టీ తరఫున పది జిల్లాలలో ఓ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వర రావు ఓ అడుగు ముందుకేసి తెలంగాణకు ప్రత్యేక కమిటీ వేస్తే బాగుంటుందని సూచించారు.

English summary
CPI is ready to maintain distance with Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X