కెబినెట్ విస్తరణ: కిరణ్‌కు 'చిరంజీవి' ఛాయిస్

ఇప్పటికే కాంగ్రెసులో గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తల నేపథ్యంలో కేవలం పిఆర్పీ నేతలకు పదవులు కేటాయించి కాంగ్రెసు నేతలకు మొండిచేయి చూపి మిగిలిన ఐదు స్థానాలను భర్తీ చేయకుంటే కిరణ్‌ను అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదన్న సంకేతాలు వెళ్లి పార్టీ మరింత బలహీనపడే అవకాశముందని, కాబట్టి కిరణ్ చాయిస్‌కు కూడా అధిష్టానం అవకాశం ఇస్తుందనే ఆశాభావం ఆశావాహుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 19న జరిగే కేబినెట్ విస్తరణను చిరు వర్గంతోనే సరిపుచ్చుతారా లేక కాంగ్రెసు వారికి అవకాశం కల్పిస్తారా అనే అంశంపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పిఆర్పీతో పాటు కాంగ్రెసుకు అవకాశం ఇస్తే మాజీ మంత్రి దామోదర రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రసాద్ కుమార్, గండ్ర వెంకటర రమణా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తదితరులు మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్నారు.
రాయలసీమ నుండి ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు స్థానం కల్పిస్తే తమకూ చోటివ్వాలని మహ్మద్ జానీ, పాలడుకు వెంకట్రావులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించిన పక్షంలో తెలంగాణకు చెందిన డి శ్రీనివాస్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ విప్ కొండ్రు మురళి కూడా కేబినెట్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరు పట్టుబట్టిన సి రామచంద్రయ్యకు ఇస్తే ఎమ్మెల్సీలు క్యూ కట్టడం ఖాయమనిపిస్తోంది.












Click it and Unblock the Notifications