తెలంగాణ మార్చ్ కిరణ్‌కు ఎసరు పెడుతుందా?

అనుమతి ఇస్తే అవాంఛనీయ సంఘటనలేవీ జరగవని నాయకులు హామీ ఇస్తున్నప్పటికీ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితే ఉందని అంటున్నారు. 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్బంగా హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై ఉద్యమకారులు సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేశారు. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి కూడా తెలంగాణ నాయకుల నుంచి, తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.
తెలంగాణ మంత్రుల మాటలను, కాంగ్రెసు తెలంగాణ నాయకుల ఒత్తిడిని నమ్మి మార్చ్‌కు అనుమతి ఇస్తే జరగరానిది జరిగితే తన పదవికి గండం రావడం ఖాయమనే విషయం కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసు. అలాగే, తనకు వ్యతిరేకంగా చాలా మంది కత్తులు నూరుతున్నారనే విషయం కూడా ఆయన తెలుసు. కె. జానారెడ్డి వంటి మంత్రులను కిరణ్ కుమార్ రెడ్డి విశ్వసించడం లేదు. అందువల్ల వారి మాటలు విని నిర్ణయాలు తీసుకునే స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి లేరు.
సీమాంధ్ర నాయకుల ఆస్తులపై దాడులు జరగవచ్చునని నిఘా వర్గాలు చెబుతున్నాయి. హింసాత్మక సంఘటనలు జరిగితే అక్టోబర్ 1వ తేదీ నుంచి జరిగే అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుపై ప్రభావం పడుతుంది. ఈ సదస్సుకు 193 దేశాల నుచంి దాదాపు 8 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరో వైపు ఈ నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం ఉంది. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పరిస్థితి కత్తి మీది సాములా ఉంది.
సిపిఎం మినహా తెలంగాణకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ మార్చ్‌లో పాల్గొనేందుకు సిద్ధపడ్డారు. మార్చ్‌కు వారే ముందుండే ఉవకాశం ఉంది. తెలంగాణ మార్చ్‌ను తన కాళ్ల కిందికి నీరు తెచ్చేందుకు కొంత మంది వాడుకుంటున్నారని కూడా ముఖ్యమంత్రి అనుమానిస్తున్నట్లు సమాచారం. ఏమైనా, గండం ఎలా గడుస్తుందో వేచి చూడాల్సిందే.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications