వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి: తెరపైకి అసద్ 10+4, నో చెప్పిన కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asad pitches for Rayala Telangana
న్యూఢిల్లీ: మొదటి నుండి రాయల తెలంగాణ గళం వినిపిస్తున్న మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా నాలుగు జిల్లాల గల రాయలసీమను తెలంగాణ ప్రాంతంతో కలిపి రాష్ట్రాన్ని ఇవ్వాలని యూపిఏ అధినేత్రికి సూచించగా.. దానిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేరుగా తోసిపుచ్చినట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పిన అనంతరం ఆరు నెలల తర్వాత అసద్ సోనియాను బుధవారం కలిసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజన అనివార్యమైతే మాత్రం రాయలసీమలోని నాలుగు జిల్లాలను తెలంగాణతో కలిపి రాష్ట్రం ఇవ్వాలని సూచించారు. గతంలో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలన్న అసద్ తాజాగా నాలుగు జిల్లాలను కలపాలని చెప్పడం గమనార్హం. రాయల తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధాని చేస్తే నీటిపారుదలకు సంబంధించి పలు సమస్యలు తగ్గిపోతాయని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది.

అయితే అసద్ వ్యాఖ్యలను కిరణ్ వేరుగా తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. టెన్ జన్‌పథ్ చర్చల అనంతరం ఎపి భవన్‌కు వచ్చిన కిరణ్‌తో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్రమంత్రి పల్లం రాజు తదితరులు భేటీ అయ్యారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వద్ద మంగళవారం రాయల తెలంగాణ ప్రస్తావన వచ్చిందని.. రాయలసీమను రెండు ముక్కలు చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోరని తాను స్పష్టం చేశానని కిరణ్ తెలిపినట్లు సమాచారం.

అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాలను తెలంగాణలో చేర్చడం సాధ్యం కాదని దిగ్విజయ్ పేర్కొన్నట్లుగా కిరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్రం చేతుల్లో పెడితే భూమిపై మనకూ హక్కు ఉండదని, దీని వల్ల లాభమేమిటనే కోణంలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే వారం కిరణ్ మరోసారి ఢిల్లీ వచ్చే అవకాశాలున్నాయని, అప్పుడు ఆయన నిర్దిష్ట ప్రతిపాదనలు సమర్పించవచ్చునని సమాచారం. ప్రధానిని సిఎం కలవాలనుకున్నా సాధ్యపడలేదు.

English summary
MIM chief and Hyderabad MP Asaduddin Owaisi met Congress president Sonia Gandhi on Wednesday evening amidst speculation that the Majlis leader has mooted the creation of Rayala Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X