• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ నో ఛాన్స్: రాహుల్ కోసం ముందుకు...

By Srinivas
|

Rahul Gandhi
రాజ్యసభ సభ్యుడిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవి జూన్‌లో ముగుస్తుండటం, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పీఠంపై చూడాలనుకోవడం.. ఇవి ముందస్తు ఎన్నికలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని రాజ్యసభ సభ్యత్వం మరో మూడు నెలల్లో పూర్తవవుతుంది. దీంతో ఆయన పదవి విరమణకు రంగం సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఆయన మళ్లీ రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలు లేవని అంటున్నారు.

అదే సమయంలో రాహుల్ గాంధీని తెర పైకి తీసుకు వచ్చేందుకు కాంగ్రెసు వర్గాలు ఉత్సుకత చూపిస్తున్నాయి. జూన్‌లో ప్రధాని పదవీ విరమణ, రాహుల్‌ను భావి నాయకుడిగా ప్రకటించడం ఒకేసారి జరుగవచ్చునని అంటున్నారు. ఈ పరిణామాలు ముందస్తు ఎన్నికలకు అవకాశముందని అంటున్నారు. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజాకర్షక పథకాలు ప్రవేశ పెట్టనుంది.

బడ్జెట్ ఆమోదించిన తర్వాత కొద్ది రోజులకు లోక్‌సభను రద్దు చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. అక్టోబర్ - నవంబర్‌లోనే ఎన్నికలు జరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ఆమోదానికి మాత్రం సహకరించి ఆ తర్వాత వివిధ అంశాలపై పార్లమెంటును స్తంభింపచేయాలని బిజెపి, ఇతర విపక్షాలు నిర్ణయించుకున్నాయి. తాజాగా బయటపడిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ పార్లమెంటును కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన హిందూ ఉగ్రవాదంపై బిజెపి గుర్రుగా ఉంది. పార్లమెంటులో ఆయనను బహిష్కరించాలని భావిస్తోంది. మంగళవారం బిజెపి, ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు దాదాపు ఐదు గంటల పాటు చర్చించారు. కాంగ్రెస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్న నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడంపైనా మల్లగుల్లాలు పడుతున్నారట.

ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందగానే పార్లమెంట్‌ను రద్దు చేసేందుకు ప్రయత్నించవచ్చునని కమలనాథులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే పలు ఎన్నికల కమిటీలు వేయడం, రాహుల్ గాంధీని ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోవడం, అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌ల ఉరితీత ద్వారా తమ ఓటు బ్యాంకును దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం వంటివి వరుసగా చేస్తోందని, ఇవి ముందస్తు ఎన్నికల కోసమేనని బిజెపి భావిస్తోంది.

ముందస్తు వ్యూహంలో భాగంగా బిజెపి రాష్ట్రం పైనా దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణవాదులను సంతృప్తిపరచలేని నిర్ణయమే తీసుకుంటుందని దీని ఆధారంగా తెలంగాణలో తాము పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలు రూపొందించాలని కూడా ఆ పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. కాగా తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు మార్చి 10లోగా తమ పాఠ్య ప్రణాళికను పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం గవర్నర్ ద్వారా ఆదేశాలను పంపిందట. త్వరలో పరీక్షల షెడ్యూలు పూర్తి చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. మరోవైపు సీమాంధ్రలో జగన్‌ను ఎదుర్కొనే వ్యూహం పైనా కాంగ్రెసు ప్రత్యేక దృష్టి సారిస్తోందట.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ruling party at the Centre was planning early elections to the Lok Sabha in October or November this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more