'సెంటిమెంట్: జగన్ పార్టీది సమైక్యవాదమే'

అయితే పార్టీకి చెందిన నేతలు గుర్నాథ్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డిల వ్యాఖ్యలు జగన్ పార్టీ ఎటు ఉందో అనే మీమాంసలో పడేశాయంటున్నారు. తాము తెలంగాణ అంశాన్ని కేంద్రం కోర్టులో ఉంచామని కానీ, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తామని ఎప్పుడూ చెప్పలేదని గుర్నాథ్ రెడ్డి అన్నారు. తాను సమైక్యవాదని అని అవసరమైతే రాజీనామాకు సిద్ధమన్నారు. అయితే కెకె మహేందర్ ఆయన వ్యాఖ్యలు తిప్పికొడుతూ అఖిలపక్షంలో తమ వైఖరి చెప్పామన్నారు.
జగన్ పార్టీ కేంద్రం పైనే భారం వేసింది. తెలంగాణకు అనుకూలమో వ్యతిరేకమో చెప్పలేదు. ఇప్పుడు గుర్నాథ్ రెడ్డి తాము కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పలేదు. దీనిని బట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సమైక్యవాద పార్టీగా తెలంగాణవాదులు గుర్తిస్తున్నారు. తెలంగాణపై వైఖరి చెప్పక పోవడమే కాకుండా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించేది లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని కాబట్టి తాము ఖచ్చితంగా తెలంగాణ వ్యతిరేక పార్టీగానే గుర్తిస్తామని చెబుతున్నారు.
అయితే గుర్నాథ్ రెడ్డి మాట్లాడినప్పుడు పార్టీ అధిష్టానం ఆయనను మందలించిందని పార్టీ తెలంగాణకు అనుకూలంగానే ఉందని, అందుకే పలుమార్లు తమ పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని చెప్పారని ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు అంటున్నారు. అయితే సెంటిమెంట్ గౌరవించడం మాట పక్కన పెట్టి తెలంగాణకు వ్యతిరేకమా కాదా చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications