ఎన్టీఆర్ ఆడిటర్: బాబు చేసిన పనే వైయస్ చేశారా?
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలను తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన ప్రతిసారీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలను ముందుకు తెస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సిఫార్సు మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయిరెడ్డిని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) డైరెక్టర్‌గా నియమించారనే ఆరోపణ ముందుకు రావడంతోనే చంద్రబాబు హయాంలో జరగిన ఉదంతాన్ని ముందుకు పెట్టారు.
ఎన్టీ రామారావు పర్సనల్ ఆడిటర్ డి. సీతారామయ్యను రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్‌గా నియమించినప్పుడు జగన్ పర్సనల్ ఆడిటర్ విజయసాయి రెడ్డిని ఒబిసి డైరెక్టర్‌గా నియమిస్తే తప్పేమిటని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచందర్ రావు ప్రశ్నించారు. సీతారామయ్య ఎన్టీ రామారావు పర్సనల్ ఆడిటర్‌గా మాత్రమే కాకుండా చంద్రబాబు సంస్థలకు ఆడిటర్‌గా పనిచేశాడని ఆయన గుర్తు చేశారు.

సీతారామయ్య 2000లలో రిజర్వ్ బ్యాంక్ దక్షిణ ప్రాంత డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్‌గా, అపిఐడిసి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. విజయసాయి రెడ్డి ఒబిసి డైరెక్టర్‌గా జగన్ సంస్థలకు నిధులు రాబడితే అన్ని పదవులు నిర్వహించిన సీతారామయ్య ఏం చేయలేదా అని గట్టు రామచందర్ రావు అడిగారు.
సీతారామయ్య ఇప్పటికీ తెలుగుదేశంతోనే ఉన్నారని, ఎన్టీఆర్ ట్రస్టు సభ్యుడిగా కూడా ఉన్నారని ఆయన చెప్పారు ఎన్టీఆర్ ట్రస్టుకు చంద్రబాబు నాయుడు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆయన సతీమణి భువనేశ్వరి సభ్యులుగా ఉన్నారని ఆయన చెబుతూ ట్రస్టు వ్యవహారాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తం మీద, చంద్రబాబు నాయుడు చేసిన పనులే వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని సమర్థించుకోవడానికి అవసరమైన వాదనను ఎప్పటికప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమకూర్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications