ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: బద్వేలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
కడప జిల్లాలో రాజకీయంగా ప్రత్యేక స్థానం బద్వేలు నియోజకవర్గంది. ఇక్కడ ప్రతీ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన.. స్ఫ ష్టమై తీర్పు ఇవ్వటం సాధారణం. 20104 వరకు జనరల్ స్థానం గా ఉన్న బద్వేలు..2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో ఎస్సీ రిజర్వ్ గా మారింది. డీ లిమిటేషన్ లో బి కోడూరు, గోపవరి మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. ఈ నియో జకవర్గంలో బి వీరారెడ్డి ఇదే నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. వీరారెడ్డి ఎన్టీఆర్.. చంద్రబాబు క్యాబినెట్లలో మంత్రిగా పని చేసారు. వీరారెడ్డి మరణం తరువాత ఆయ న కుమార్తె విజయమ్మ గెలుపొందారు. డాక్టర్ వడ్డమాని శివరామకృష్ణారావు ఏడు సార్లు పోటీ చేసి..ఒక్క సారి గెలిచారు. 2004 నుండి ఈ నియోజకవర్గంలో సమీకర ణాలు వేగంగా మారిపోయాయి.
16 సార్లు ఎన్నికలు..2.20 లక్షల ఓటర్లు..
బద్వేలు నియోజకవర్గంలో 1952 నుండి ఇప్పటి దాకా 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి 4 సార్లు, పిఎస్‌పి, జనతా, స్వతంత్ర అభ్యర్ధులు..ఒక సారి చొప్పున గెలిచారు. వైసిపి నుండి ఒకసారి గెలిచారు. కాగా, ఇదే నియోజకవర్గంలో 2014 లెక్కల ప్రకారం మొత్తం ఓటర్లు 213176. అందులో పురుష ఓటర్లు 75236 కాగా, మహిళా ఓటర్లు గా 70058 మంది నమోదయ్యారు. 2014 ఎన్నికల్లో మొత్తంగా 154294 ఓట్లు పోలవ్వగా .. 72.38 శాతం పోలింగ్ నమోదైంది.

2014 ఎన్నికల్లో..వైసిపి విజయం..
బద్వేలు లో 2014 లో జరిగిన ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన తిరువీధుల జయరాములుకు 78362 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన విజయ జ్యోతికి 68,800 ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి జయరాములు 10079 ఓట్ల మెజా ర్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications