ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: భీమవరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. పాలకొల్లు నియోజకవర్గం నుండి వీరవాసరం మండలం ఈ సెగ్మెంట్‌లో చేరింది. నరసాపురం, ఉండి, పొలకొల్లు నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఉన్న భీమవరం మొత్తం మండలం ఈ సెగ్మెంట్‌లోనే చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో పెద్ద పట్టణం ఇది. ఇక్కడ టిడిపి నుండి నరసింహ రాజు నాలుగు సార్లు గెలిచారు. వెంకట్రామయ్య, భూపతిరాజు విజయకుమార్ రాజు లు రెండేసి సార్లు ఇక్కడే నెగ్గారు. విజయకుమార్ రాజు లోక్‌సభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. కలిదిండి విజయ నరసింహరాజు అత్తిలి లో కూడా రెండు సార్లు విజయం సాధించారు. ఇక, 2009 , 2014 ఎన్నికల్లో ఇక్కడ ఒకే అభ్యర్ది విజయం సాధించారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
భీమవరం నియోజకవర్గం లో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఏడు సార్లు కాంగ్రెస్..టిడిపి అయిదు సార్లు గెలిచింది. కెఎంపిపి ఒకసారి, స్వతంత్ర అభ్యర్ది ఒక సారి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసిన రామాంజనేయులు ప్రజారాజ్యం అభ్యర్ది పై విజయం సాధించారు. రామాజంనేయులు 2014 లో టిడిపిలో చేరి తిరిగి ఆ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 225646 ఓట్లు ఉండగా..అందులో 174947 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన రామాంజనేయులుకు 90772 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ కు 77046 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్య ర్ది రామాంజనేయు లు 13726 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు.












Click it and Unblock the Notifications