ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: భీమిలి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా భీమునిపట్నం అసెంబ్లీ భీమిలి గా మారింది. భీమునిపట్నం పూర్తిగా భీ మిలి లో చేరింది. పెందుర్తి నుండి విశాఖపట్నం రూరల్ మండలం కొత్తగా వచ్చి చేరింది. రాజాగా ప్రసిద్ది గాంచిన పివిజి రాజు ఇక్కడ నుండి మూడు సార్లు విజయం సాధించారు. మరో మూడుసార్లు విజయనగరం నుండి ఎన్నికయ్యారు. ఆయ న కుమారుడు ఆనంద గజపతి రాజు మరోసారి గెలవగలిగారు. టిడిపి పక్షాన ఆర్ఎస్‌డిపిఎఎన్ రాజు నాలుగు సార్లు నెగ్గారు .పివిజి రాజు, ఆనందగజపతి రాజు ఇద్దరూ లోక్‌సభ సభ్యులుగా కూడా పని చేసారు. పివిజి మరో కుమారుడైన ఆశోక్ గజప తి రాజు ఏడు సార్లు శాననసభకు ఎన్నికయ్యారు.
15 సార్లు ఎన్నికలు..
భీమిలి నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ఆరు సార్లు గెలిచింది. టిడిపి అవిర్భావం తరు వాత వరుసగా ఇక్కడ ఆరు సార్లు గెలిచింది. ఒకసారి ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్ది , ఒక స్వతంత్ర అభ్యర్ది కూడా గెలిచారు . 2009 ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు టిడిపి అభ్యర్ది ఆంజనేయ రాజు మీద గెలి చారు. ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయింది. 2014 ఎన్నికల ముందు గంటా శ్రీనివాస రావు తో కలిసి ఆయన టిడిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో మొత్తంగా 281799 ఓట్లు ఉండగా, అందులో 209418 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావుకు 118020 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన కర్రి సీతారాం కు 80974 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది గంటా శ్రీనివసరావు 37226 ఓట్ల మెజార్టీతో గెలుపొందా రు. ఈ ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివా సరావు టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications