ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గాజువాక నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గ్రేటర్ విశాఖలో విలీనమైన గాజువాక మండలం కొత్తగా గాజువాక నియో జకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ జరిగిన తొలి ఎన్నికలో ప్రజారాజ్యం అభ్యర్ది గెలుపొందారు. అంతుకు ముందు పరవాడ గా ఉండే నియోజకవర్గం 2009 లో రద్దు అయింది. ఇక్కడ నుండి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మూడు సార్లు గెలిచారు. భాట్టం శ్రీరామమూర్తి రెండు సార్లు, పైలా అప్పలనాయుడు రెండు సార్లు గెలుపొందారు. ఆయన ఎంపీగా నూ వ్యవహరించారు. పివి, జలగం, అంజయ్య మంత్రి వర్గాల్లోజ పని చేసారు. బండారు సత్యనారాయణ మూర్తి టిడిపి లో మంత్రిగా వ్యవహరించారు. ఇక, 2004 లో ఇక్కడ గండి బాబ్జీ కాంగ్రెస్ నుండి గెలుపొందారు. 2009 లో గాజువాక కొత్తగా ని యోజకవర్గంగా ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
2009 లో రద్దు అయిన పరవాడ లో 1952 నుండి 2004 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో నాలుగు సార్లు కాంగ్రె స్ గెలిచింది. టిడిపి అయిదు సార్లు గెలుపొందింది. సిపిఐ, కెఎల్‌పి, స్వతంత్ర అభ్యర్దులు ఒక్కోసారి నెగ్గారు. ఇక, 2009 లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్ది వెంకటరామయ్య సమీప ప్రత్యర్ది స్వతంత్ర అభ్యర్ది నాగిరెడ్డి పై 17907 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. 2014 లో రాష్ట్ర విభజన ప్రభావంతో ఇక్కడ రాజకీయాల్లో మార్పులు జరిగాయి.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 లో ఇక్కడ మొత్తంగా 290224 ఓట్లు ఉంటే, అందులో 187298 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ కు 97109 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన నాగిరెడ్డికి 75397 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది పల్లా శ్రీనివాస్ 21712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications