ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కాకినాడ సిటీ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియెజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇక్కడ స్వల్ప మార్పులు జరిగాయి. కాకినాడ అర్బన్ అలాగే ఉండగా, కొ న్ని డివిజన్లను ఇక్కడ నుండి తప్పించి కాకినాడ రూరల్ లో చేర్చారు. 1955 లో ఇక్కడ గెలిచిన పల్లంరాజు ఆ తరువాత రామచంద్రాపురం నుండి ఎమ్మెల్యేగా , కాకినాడ నుండి లోక్‌సభకు ఎన్నికైన సంజీవరావు తండ్రీ కొడుకులు. కాకినాడ లో తాత, తండ్రి. మనమడు ముగ్గురూ ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. కాకినాడ నుండి టిడిపి పక్షాన మూడు సార్లు, కాంగ్రెస్ నుండి ఒకసారి ఎన్నికైన ముత్తా గోపాలకృష్ణ 2009 లో సీటు దక్కలేదు. గోపాలకృష్ణ గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో పని చేసారు. ఇక, 2009 ఎన్నికల నాటి నుండి ఇక్కడి సమీకరణాలు మారిపోయాయి.
15 సార్లు ఎన్నికలు జరిగితే..
ఇక్కడ మొత్తంగా 15 సార్లు ఎన్నికల జరిగితే అందులో ఆరుసార్లు కాంగ్రెస్, అయిదు సార్లు టిడిపి, రెండు సార్లు సిపిఐ, రెండు సార్లు స్వతంత్రులు గెలిచారు. కాకినాడ లో ఒకసారి గెలిచి..మరోసారి ఓడన టిడిపి నేత వి వెంకటేశ్వర రావు నియోజకవర్గాల పునర్విభజన తరువాత మరోసారి గెలిచారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 207111 ఓట్లు ఉండగా, అందులో 189557 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన వెంకటేశ్వరరావు కు 76467 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి 52467 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది వెంకటేశ్వరరావు 24000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications