ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కాకినాడ రూరల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం కాకినాడ రూరల్. నియోజకవర్గం ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం గెలుపొందింది. ఆ పార్టీ నుండి కురసాల కన్నబాబు గెలు పొందారు. 1955 లో తొలుత పల్లపాలెం గా , ఆ తరువాత 1962 లో కరప గా, 1962 నుండి తాళ్లరేవు నియోజకవర్గంగా ఉండి డీ లిమిటేషన్ లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. తాళ్లరేవు లో అత్యధికంగా అయిదు సార్లు చిక్కాల రామచంద్రరావు గెలి చారు. ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు వద్ద మంత్రిగా పని చేసారు. మిగిలిన వారంతా ఒక్కోసారి మాత్రమే గెలుపొందారు. 2009 లో ప్రజారాజ్యం అభ్యర్ది ఇక్కడ గెలిచినా..ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయింది. 2014 ఎన్నికల సమ యంలో కన్నబాబు ఇక్కడి నుండి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసారు.
12 సార్లు ఎన్నికలు జరిగితే..
తాళ్లరేవు లో 10 సార్లు ఎన్నికలు జరిగితే అందులో నాలుగు సార్లు కాంగ్రెస్ , అయిదు సార్లు టిడిపి, ఒకసారి జనతా పార్టీ అభ్యర్దులు గెలిచారు. కాకినాడ రూరల్ లో 2009 లో ప్రజారాజ్యం గెలవగా, 2014 లో టిడిపి గెలిచింది. 2009 లో ఇక్కడి నుండి గెలిచి..2014లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసిన కన్నబాబు ఆ తరువాత వైసిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 221700 ఓట్లు ఉండగా, అందులో 165338 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసి అనంత లక్ష్మికి 61144 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన వేణు గోపాల్ కు 52096 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది పిల్లి అనంత లక్ష్మీ కి 9048 ఓట్ల మెజార్టీ దక్కింది. స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసిన కన్నబాబు కు 43742 ఓట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications